11 ఏళ్ల బాలుడు ఆత్మహత్య

11 ఏళ్ల బాలుడు ఆత్మహత్య
  • అమ్మ చదువుకొమ్మన్నందుకు

ముద్ర ప్రతినిధి, మెదక్:చదువుకోమన్నందుకు తల్లితో గొడవపడి 11ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం చిట్కుల్ లో సోమవారం రాత్రి జరిగింది. ఏఎస్ఐ మిస్బావొద్దిన్ కథనం ప్రకారం.. మండలంలోని చిట్కుల్ గ్రామానికి చెందిన చాకలి కుమార్ కొడుకు చాకలి సత్యనారాయణ(11) జోగిపేటలో ఆరవతరగతి చదువుతున్నాడు. సత్యనారాయణకు మానసిక స్థితి సరిగ్గా లేదు. గతంలో రెండుసార్లు ఆత్మహత్యా యత్నం చేసినట్లు కుటుంబీకులు తెలిపారు. హాస్టల్ కు వెళ్లాలని చెప్పగా తల్లితో గొడవ పడ్డాడు. తల్లి పనికి వెళ్లి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో దూలానికి చీరతో ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి చాకలి వెంకమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని ఏఎస్సై తెలిపారు.