మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు

మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు

కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మ
ముద్ర ప్రతినిధి, మెదక్: రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలు మెదక్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంసిహెచ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఎంసి హెచ్ లో బాలింతలకు పండ్లు, బ్రెడ్లు అందజేశారు. డిసిహెచ్ డాక్టర్ పి.. చంద్రశేఖర్, గైనకాలజిస్ట్ ఎం. శివదయాల్, మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున గౌడ్, ఎఎంసి చైర్మన్ బట్టి జగపతి, కౌన్సిలర్ ఆర్కే శ్రీనివాస్, నాయకులు అశోక్, పడాల సతీష్, మంగ రమేష్ గౌడ్, కొండ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.