మినీ గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ జిల్లా అదనపు రమేష్

మినీ గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ జిల్లా అదనపు రమేష్

ముద్ర ప్రతినిధి,మెదక్: జిల్లాలోని మెదక్, కౌడిపల్లిలోని మినీ గురుకులాల్లో గల వివిధ తరగతుల్లోని  ఖాళీ భర్తీకి (2023-24) అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ రమేష్, రీజినల్ కో ఆర్డినేటర్ టి.సంపత్ కుమార్ తెలిపారు. మెదక్ లోని మినీ గురుకులంలో  1వ తరగతిలో 30 సీట్లతోపాటు 2వ తరగతిలో 2 సీట్లు, 3వ తరగతిలో 1 సీటు ఉన్నాయి. కౌడిపల్లిలో  1వ తరగతిలో 30, రెండవ తరగతిలో 17, మూడవ తరగతిలో 10, నాల్గవ తరగతిలో 3 బ్యాక్ లాగ్ ఖాళీల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు.  ఆయా పాఠశాలల్లో చేరేందుకు మెదక్, కౌడిపల్లి మండలాలకు చెందిన గిరిజన బాలికలకు మాత్రమే అవకాశం ఉందన్నారు. 5 సంవత్సరాల వయసు పూర్తి చేసుకున్న బాలికలు వచ్చే నెల 4వ తేదిలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వచ్చే నెల 10వ తేదీన లాటరీ పద్దతిన విద్యార్థినులను ఎంపిక చేస్తామన్నారు. తల్లిదండ్రులు ఆదాయపు దృవీకరణ పత్రంతోపాటు బర్త్ సర్టిఫికెట్, కులం, ఆదాయం, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు జత చేసి గజిటెడ్ అధికారి దృవీకరణతో మెదక్, కౌడిపల్లి మినీ గురుకులంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. వివరాల కోసం 9948900450 (మెదక్), 8790641672 (కౌడిపల్లి) నెంబర్లకు సంప్రదించాలన్నారు.