మైనార్టీలను అంచి వేసి. మహిళలను వివస్తలను చేసి అధికారంలోకి రావడమే మీ విధానమా....

మైనార్టీలను అంచి వేసి. మహిళలను వివస్తలను చేసి అధికారంలోకి రావడమే మీ విధానమా....

బిజెపి నేతలను నిలదీసిన ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి..

మోటకొండూర్ (ముద్ర న్యూస్): దేశంలోని మైనార్టీలను అంచివేసి. మహిళలను వివస్తలను చేసి అధికారంలోకి రావడమే మీ విధానమా అని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచకొండ జనార్ధన్ బిజెపి. ఆర్ఎస్ఎస్ నాయకులను ప్రశ్నించారు. శనివారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలంలోని ఇక్కుర్తి గ్రామంలో మణిపూర్ రాష్ట్రంలోని ఆదివాసి మహిళలను వివస్తలను చేసి ఊరేగింపు చేపట్టి. అత్యాచారం. హత్యలను చేయడాన్ని నిరసిస్తూ పిఓడబ్ల్యూ. ఐఎఫ్టియుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఎవరి మతాలు. ఎవరి నమ్మకాలు వారికి ఉన్నప్పటికీ మైనార్టీ మతస్తులపై.

ప్రజలపై దాడులు రాజ్యాంగ విరుద్ధం కాదా అని ఆయన బిజెపి. ఆర్ఎస్ఎస్ నాయకులను నిలదీశారు. ప్రజలు ఎల్లకాలం చూస్తూ ఊరుకోరని తగిన సమయంలో మీకు తగిన బుద్ధి చెబుతారని ఆయన బిజెపి. ఆర్ఎస్ఎస్ నాయకులను హెచ్చరించారు. మైనార్టీ మతస్తులు మనుషులేననే కనీస ఆలోచన లేకుండా మణిపూర్ రాష్ట్రంలో మైనార్టీ ఆదివాసి ప్రజలపై ముఖ్యంగా కుకీ తెగకు చెందిన ముగ్గురు మహిళలను వివస్త్రతలను చేసి ఊరేగించడం. అడ్డుగా వచ్చిన తమ్ముడిని. తండ్రిని. మహిళలను అత్యాచారాలు చేసి. హత్యలు చేయడం ఏయమైనా చర్యగా ఆయన అభివర్ణించారు. ఆదివాసి మహిళలపై అమానుషమైన దుర్మార్గానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించి. దేశంలోని. రాష్ట్రంలోని మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మణిపూర్ ఘటన మానవత్వం ఉన్న ప్రతి మనిషిని కదిలించి. మనోవేదనకు గురి చిన్నప్పటికి ప్రధాని నరేంద్ర మోడీకి మాత్రం కనీస బాధ. చలనం లేకుండా మొత్తం నిద్రలో ఉండి మౌనాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఈ మౌనమే దేశానికి అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. సర్వ మతాలకు అనుకూలంగా రాజ్యాంగంలో అవకాశం ఉన్నప్పటికీ ఒక్క హిందూ మతస్తులు మాత్రమే ఈ దేశంలో ఉండాలని సమాజానికి మంచిది కాదని సూచించారు.

సర్వ మతాలకు నిలయంగా భారతదేశం నిలిచిందనే విషయాన్ని మర్చిపోయిన ఆర్ఎస్ఎస్. బిజెపి. మతోన్మాద శక్తులు మైనార్టీ ప్రజలపై దాడులు చేస్తూ మరణకాణం కొనసాగించడమే భారత్ మాత గురించి నిత్యం మాట్లాడుతున్న బిజెపి. ఆర్ఎస్ఎస్ నాయకులు భారతీయ మహిళలను ముఖ్యంగా అడవిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసి అడవి బిడ్డలను వ్యవస్థలను చేసి. అత్యాచారాలు. హత్యలు చేయడం అనాగరిక సమాజంలో కూడా జరగలేదని గుర్తు చేశారు. ఇంత అన్యాయానికి పాల్పడడం అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మనుషులను. మైనార్టీలను చంపి. మానవత విలువలను మంటగలుగుతున్న హిందూ మనుధర్మ శాస్త్ర. మతోన్మాద శక్తుల సమాజ తిరోగమన విధానాలను అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చీర బోయిన రాజయ్య. జిల్లా నాయకులు చీరబోయిన కొమరయ్య. పి వై ఎల్ జిల్లా అధ్యక్షులు సాదుల శ్రీకాంత్. డబ్ల్యూ నాయకురాల్లు తమ్ముడి భార్గవి. సాదుల కలమ్మ. సాదుల లక్ష్మీ. నెల్లుట్ల ఎల్లమ్మ. ఎన్ బిక్షపతి. రాగి రామచంద్రారెడ్డి. నిలిగొండ అంజయ్య. కందుల మైసయ్య. కారే అఖిల్. దాసరి అంజయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు......