రుద్రారంలో కార్డెన్ సర్చ్

రుద్రారంలో కార్డెన్ సర్చ్
  • అపరిచిత వ్యక్తుల పట్ల  అప్రమతంగా ఉండాలి
  • డీఎస్పీ యాదగిరి రెడ్డి

చిన్నశంకరంపేట,ముద్ర:-చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో తూప్రాన్ డిఎస్పి యాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. గ్రామంలో వాహనాలను తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 44 బైకులను స్వాధీన పరచుకున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామస్తులతో డీఎస్పీ యాదగిరి రెడ్డి మాట్లాడుతూ వాహనాలు నడిపిస్తున్నప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి ఉండాలని, బైకుకు సంబంధించి అన్ని పత్రాలు ఉండాలని, అపరిచిత వ్యక్తులు కనిపిస్తే పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయాలని తెలిపారు. సైబర్ నేరాల పట్ల అప్రమతంగా  ఉండాలని, ఫోన్ నెంబర్, ఏటీఎం పిన్ నెంబర్, ఓటిపి నంబర్లు ఎవరికి తెలుపవద్దని తెలిపారు. ఫోన్లో అనేక యాప్లు పెట్టి క్లిక్ చేయమనడం వంటివి వస్తున్నాయని క్లిక్ చేయకూడదన్నారు. డబ్బులు సైబర్ నేరగాళ్లు ఖాతా నుండి గుంజేస్తున్నారని తెలిపారు. గ్రామస్తులు ఏదేని పనిమీద బయటకు, బంధువులు పెళ్లిళ్లు వెళ్తే తాళం వేసిన వాటిని కొంతమంది దుండగులు తాళాలు పగలగొట్టి దోచుకెళ్తున్నారని సూచించారు. గ్రామంలో అసాంఘిక కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని లేనియెడల కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కంపెనీ నుండి వ్యర్థ పదార్థాలు గ్రామ శివారులో వదలడం ద్వారా దుర్వాసన వస్తుందని గ్రామస్తులు డిఎస్పి యాదగిరి రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.ఈ కార్యక్రమంలో రామాయంపేట సిఐ, ఎస్సై సుభాష్ గౌడ్,  పోలీస్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.