హుజూరాబాద్‌లో సైకో ఎమ్మెల్సీ

హుజూరాబాద్‌లో సైకో ఎమ్మెల్సీ

పద్ధ మార్చుకోకుంటే చెప్పులు మెడకేస్తాం.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌

ముద్ర ప్రతినిధి, జనగామ: హుజూరాబాద్‌ ప్రజలపైన కేసీఆర్‌‌ ప్రభుత్వం ఓ సైకోను ఎమ్మెల్సీగా పెట్టి, అన్ని వర్గాల ప్రజలపై దాడులు చేయిస్తోందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ఆ సైకో తన పద్ధతి మార్చుకోకుంటే నడిరోడ్డుపై చెప్పల దండ వేస్తామని పరోక్షంగా కౌశిక్‌రెడ్డిపై విమర్శలు చేశారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఆయన మార్గమధ్యలో జనగామ జిల్లా కేంద్రం, రఘునాథపల్లి మండలం నిడిగొండలో ముదిరాజులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఈటల మీడియాతో మాట్లాడారు. కొన్ని రోజులుగా హుజూరాబాద్‌ సైకో ఎమ్మెల్సీ ప్రజలను తిట్టడం, కొట్టడం చేస్తున్నాడకన్నారు.

ఇక మా లాంటి వారి మీద కూడా దాడులకు ప్లాన్ చేస్తున్నాడని, ‘సుపారి ఇచ్చాం.. ఏదో ఒక రోజు చంపేస్తాం..’ అని మాట్లాడుతున్నాడని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ అండతోనే అతడు రెచ్చిపోతున్నాడన్నారు. సైకో తీరుపై కరీంనగర్, వరంగల్ సీపీ లకు కంప్లైంట్ కూడా చేశామని చెప్పారు. తమ సహనానికి కూడా హద్దు ఉంటుందని, తమ ఓపిక, సహనం, మంచితనాన్ని అసమర్థతగా చూడవద్దన్నారు. ఇప్పకైనా ఆ సైకో తన పద్ధతి మార్చుకోకుంటే హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో, జమ్మికుంట గాంధీ చౌరస్తాలో చెప్పులు మెడలో వేసి తిప్పుతామని హెచ్చరించారు. సమావేశంలో సమావేశంలో జనగామ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దశమంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు మద్దెల సంతోష్, ముదిరాజ్ సంఘం నాయకులు కల్నాల్‌ డాక్టర్‌ మాచర్ల భిక్షపతి, కట్ల సదానందం పాల్గొన్నారు.