గరీబోళ్లకు అండగా సీఎం కేసీఆర్

గరీబోళ్లకు అండగా సీఎం కేసీఆర్
  • ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యంగా కృషి
  • దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం
  • జడ్పీ చైర్మన్ వేలేటి రోజు రాధాకృష్ణశర్మ

ముద్ర ప్రతినిధి :సిద్దిపేట:-ఇల్లు కట్టి చూడు,పెళ్లి చేసి చూడు అనే సామెత  తెలంగాణా రాష్ట్రంలో ఉందని,నేడు పేదింటి వధువు పెళ్లికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ఎంతో భరోసా ఇస్తుందని  సిద్దిపేట జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ తెలిపారు.తొగుట మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మండలంలోని 15 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే రఘనందన్ రావు, ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి తన్నీరు హరీశ్రావుల ఆధ్వర్యంలో ప్రజారోగ్యంకు పెద్దపీఠ వేయడం జరిగిందని, నేడు ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెరుగుతున్నాయని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. చిన్న పాప నుండి బాలింత వరకు ఆరోగ్యం, పౌష్టికాహారం, ప్రోత్సాహం అందిస్తున్నారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాతే అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందని, తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. గ్రామ గ్రామాన పార్కులు,నర్సరీలు, డంప్ షెడ్లు,స్మశాన వాటికలు, మరుగుదొడ్లు, ఇంటింటికి తాగునీటి సరఫరాతో గ్రామాల దశ మారిపోయిందన్నారు. ఎమ్మెల్సీ  డాక్టర్ వంటేరు యాదవ రెడ్డి మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్  కృషి చేస్తున్నారని తెలిపారు.తెలంగాణ స్ఫూర్తి గా దేశ అభివృద్ధి ని ముందుకు తీసుకెళ్లాడానికే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారన్నారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు తో పాటు పలువురు పాల్గొని మాట్లాడారు.