హౌసింగ్ స్కాంలో కేసులు పెడితే సగం కాంగ్రెస్ వాళ్లు జైల్లో ఉండేది

హౌసింగ్ స్కాంలో కేసులు పెడితే సగం కాంగ్రెస్ వాళ్లు జైల్లో ఉండేది
  • పార్లమెంట్ లో దాడి దురదృష్టకరం
  • మాజీ మంత్రి హరీష్ రావు

ముద్ర ప్రతినిధి, మెదక్:బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక  హౌసింగ్ స్కాంలో కేసులు పెడితే సగం మంది కాంగ్రెస్ వాళ్లు జైల్లో ఉండేవారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సాధించిన తెలంగాణలో కక్షలు, పగలతోను ఎవరు ఇబ్బంది పడకూడదని కెసిఆర్  పని మీద దృష్టి పెట్టారన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో కంజర్ల ఫంక్షన్ హాల్  బిఅర్ఎస్ కృతజ్ఞత సభను ఎమ్మెల్యే సునీత రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రీ హరీష్ రావు మాట్లాడుతూ..

కెసిఆర్ కు పనితనం తప్ప పగతనం తెలియని నాయకుడన్నారు. రాజకీయాలన్నప్పుడు గెలుపు, ఓటములు ఉంటాయి, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళతామన్నారు.ఓటమికి తప్పు ఒప్పులేందో  సవరించుకుని ముందకు వెళ్ళాలని కోరారు.రాబోయే జిల్లా పరిషత్, మండల పరిషత్, పార్లమెంట్ ఎన్నికలు అందరం కలిసికట్టుగా పని చేసి విజయం వైపు అడుగులు వేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అధికారపక్షమైనా, ప్రతిపక్షమైన మనం ప్రజల పక్షన ఉంటామన్నారు.ప్రతిపక్షంలో ఉంటే కాంగ్రెస్ హామీల కోసం శాసనసభలో గర్జిస్తామన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన నాలుగు రోజులైతే పాలుఏందో... నీళ్లు ఏందో...  ఎవరేందో అనేది  ప్రజలకు అర్థమవుతుందన్నారు. తాత్కాలికంగా వేగం తగ్గినా అంతిమంగా గమ్యం చేరేది బిఆర్ఎస్ పార్టీ అన్నారు.అద్భుతమైన భవిష్యత్తు ఉండేది బిఆర్ఎస్ పార్టీకి అని స్పష్టం చేశారు.

అధికార పక్షం కార్యకర్తల ఆత్మస్థైర్యం  దెబ్బతీసేందుకు  కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయాలని ప్రయత్నం చేస్తారన్నారు. ఎవరు ధైర్యాన్ని కోల్పోవద్దనీ నేను సునితరెడ్డి, మధనరెడ్డి మీకు అండగా ఉంటామని హరీష్ రావు అభకకమిచ్చారు. నర్సాపూర్  బిఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని ఎన్నికల్లో నిరూపించారన్నారు. నర్సాపూర్ లో హ్యాట్రిక్ కొట్టడం సంతోషంగా ఉందన్నారు.ఈ ఎన్నికల్లో కష్టపడి పని చేసిన వారికి తప్పకుండా  ఇచ్చిన మాట ప్రకారం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో  సర్పంచులుగా, ఎంపిటిసిలుగా , కౌన్సిలర్ లుగా గెలిపించుకోవడానికి మేమందరం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు.మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి జ్వరం వచ్చినప్పటి కూడా గ్రామ గ్రామాన తిరిగి కష్టపడి పని చేశారన్నారు. నర్సాపూర్ శాసన సభ్యురాలు సునితరెడ్డిని  మంచి మెజార్టీతో గెలిపించారన్నారు. ఈ సభలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, నాయకులు దేవేందర్ రెడ్డి, గాలి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పార్లమెంట్ మీద దాడి బాధాకరం

కొత్త పార్లమెంటులోకి ఇద్దరు దుండగులు దూరి దాడి చేయడం బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈ చర్యను తీవ్రంగా ఖండించారు.దుండగులను కఠినంగా శిక్షించాలని బిఅర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.దీనిపై విచారణ జరిపిభద్రత లోపాలను కట్టుదిట్టం చేసి పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మాటలు ఘనంగా ఉండటం కాదు చేతలు కూడా ఘనంగా ఉండాలనీ కేంద్ర ప్రభుత్వంపై ద్వజమెత్తారు.