విద్యుత్ షాక్ తో వరికోత యంత్రం దగ్ధం

విద్యుత్ షాక్ తో వరికోత యంత్రం దగ్ధం

తూప్రాన్,ముద్ర: వరి కోత మిషన్ విద్యుత్ షాక్ తో దగ్ధమయిన సంఘటన మనోహరాబాద్ మండలంలోని దండుపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మండల కేంద్రానికి చెందిన వరికోత మిషన్ తో దండుపల్లి గ్రామ శివారులో వరి  కోస్తుండగా విద్యుత్ తీగలు తగలడంతో వాహనంలో  మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంగా వాహనం నుండి  ప్రమాదం తప్పింది. విద్యుత్ సరఫరాను నిలిపివేసి చుట్టుపక్కల వారు మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రాణ నష్టం జరగలేదు.