ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే కారు దగ్ధం... అడ్డాకులి హత్య..

ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే కారు దగ్ధం... అడ్డాకులి హత్య..

 సెక్రటేరియట్  ఉద్యోగి అరెస్ట్.. వివరాలు వెల్లడించిన మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
మెదక్, ముద్ర ప్రతినిధి:  రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కారు దగ్ధం, వ్యక్తి సజీవ దహనం కేసును మెదక్ జిల్లా పోలీసులు చేదించారు. ట్రేడింగ్ లో ఆర్థికంగా నష్టపోయిన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపూర్ గ్రామపంచాయతీ భీమ్లా తాండకు చెందిన పాతులోత్ ధర్మ  సెక్రటేరియట్ ఉద్యోగి. ట్రేడింగ్ లో తీవ్రంగా నష్టపోయిన ధర్మ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయన్న ఆశతో ఈనెల 9న అర్ధరాత్రి తన కారును పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. తానే మరణించినట్లు నమ్మించడం కోసం నిజామాబాద్ రైల్వే అడ్డా నుండి ఓ కూలిని తీసుకువచ్చి గొడ్డలితో కర్రతో చంపి డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి సజీవ దహనమైనట్లు నమ్మింమించారు.  సజీవ దహనమైన వ్యక్తి తన భర్తె అని పోలీసులకు తెలియజేసి భార్య నాటక మాదింది. 

సంఘటన జరిగిన రోజు నుండి అనుమానం రావడంతో అన్నీ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. మెదక్ డిఎస్పి సైదులు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసును పరిశోధించగా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఈ పథకం వేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో ప్రభుత్వ ఉద్యోగి ధర్మాతో పాటు ఆయన భార్య నీలా, కుటుంబ సభ్యులు తేజావత్ శ్రీనివాస్,, తేజ, మరో 17 సంవత్సరాల బాలుడు ఈ హత్యలో ఉన్నట్లు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని వివరించారు. గత ఏడాది కాలంగా ఈ పథకం పన్నుతున్నట్లు వెల్లడించారు. నిందితులను కోర్టుకు హాజరు పరిచినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్పి డాక్టర్ బాలస్వామి, డిఎస్పి సైదులు, అల్లాదుర్గం సీఐ జార్జి తదితరులు ఉన్నారు.