పాసిస్టు విధానాలు ఎండకట్టేందుకే వామపక్షాల ఐక్యత. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ. మల్లేశం

పాసిస్టు విధానాలు ఎండకట్టేందుకే వామపక్షాల ఐక్యత. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ. మల్లేశం

ముద్ర ప్రతినిధి, మెదక్: దేశంలో మతోన్మాద శక్తి బీజేపీ పాసిస్టు విధానాలు ఎండకట్టడం కోసం వామపక్షాల ఐక్యత ఎంతో అవసరమని సీపీఎం మెదక్ జిల్లా కార్యదర్శి ఎ. మల్లేశం అన్నారు . ఆదివారం హైదరాబాద్ లో నిర్వహిస్తున్న సీపీఐ, సీపీఎం మండల స్థాయి కార్యకర్తల రాష్ట్ర సదస్సుకు మెదక్ జిల్లా నుండి సీపీఎం నాయకత్వం బయలుతీరింది. ఈ సందర్భంగా ఎ. మల్లేశం మాట్లాడుతూ దేశంలో పెట్టుబడి విధానాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ, మతాల మధ్య చిచ్చు పెడుతూ పరిపాలన చేస్తున్న మోడీ ప్రభుత్వం అత్యంత ప్రమాదకరంగా మారిందన్నారు. ప్రపంచ దేశాలలో ఎక్కడ లేని విలువలు భారత దేశంలో ఉన్నాయి కానీ, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విలువలను పాతరేస్తూ రాజ్యం ఏలుతుందని మండిపడ్డారు. ఎంత సేపు హిందూ, ముస్లిం అంటూ అల్లర్లు సృష్టిస్తూ హింసాఖాండాను చెలరేపుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ కేంద్రంలో బీజేపీ పరిపాలిస్తుందని మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగానికే ప్రమాదం ఉందన్నారు. లౌకిక, ప్రజాస్వామ్య , రాజ్యాంగ విలువలు కాపాడుకోవడం కోసం కచ్చితంగా వామపక్షాలు కలవాల్సిన అవసరం ఉన్నదని అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం వామపక్ష పార్టీలు కలిసి  సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ లో కూడా బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో , దేశంలో కచ్చితంగా పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మల్లేశం, బస్వరాజు,  జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి నాగరాజు, సంతోష్,  గీత, నాయకులు శేఖర్, దాసు, లచ్చగౌడ్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.