గుట్టలను మాయం చేస్తున్న మట్టి మాఫియా

గుట్టలను మాయం చేస్తున్న మట్టి మాఫియా
  • యథేచ్చగా ఎర్రమట్టి తరలింపు
  • పట్టించుకోని అధికారులు

పెద్ద శంకరంపేట, ముద్ర: మండలంలోని చీలపల్లి గ్రామ పరిధిలోని ఉన్న గుట్టను త్రవ్వి టిప్పర్ల ద్వారా మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ దంద మూడు పువ్వులు... ఆరు కాయలుగా కొనసాగుతోంది. గుట్టల ద్వారా వచ్చే ఎర్రమట్టిని త్రవ్వి దందా చేస్తున్నారు. తవ్వకాలకు ప్రభుత్వ అనుమతులు తీసుకుంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పెద్ద మొత్తంలోనే ఉంటుంది. కానీ అవేవి పట్టించుకోకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమార్పులు దొడ్డి దారిన మట్టి తరలించి తమ జేబులు నింపుకుంటున్నారు. అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా గుట్టుచప్పుడు కాకుండా దంద కొనసాగు తుండటంతో చుట్టుపక్కల ఉన్న గుట్టలు కనుమరుగవుతున్నాయి.ప్రకృతి సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ చూసీ చూడని ధోరణిలో ఉన్నారు. అధికారులు సైతం అదే ధోరణి అవలంభిస్తుండడంతో లక్షల సంపద తరిగిపోతుంది.

పెరిగిన భూముల ధరలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం భూమికి ధరలు పెరిగాయి. రియలేస్టేట్ వ్యాపారులు సాగు భూములను వెంచర్లుగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో మట్టికి గిరాకీ బాగా పెరిగింది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా అదును చూసి మట్టి తప్పుకాలు చేపడుతూ వ్యాపారులు కాసులు పోగేసుకుంటున్నారు.