ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 19వ జాతీయ మహాసభలు విజయవంతం చేద్దాం

ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 19వ జాతీయ మహాసభలు విజయవంతం చేద్దాం
Let's make the 19th National Congress of Forward Block Party a success
  • 25 దేశాల నుండి ప్రతినిధులు హాజరవుతారు
  • ఎ ఐ ఎఫ్ బి రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి జోజిరెడ్డి

ముద్ర ప్రతినిధి కరీంనగర్: ఈ నెల 23 నుండి 26 వరకు హైదరాబాద్ లో జరగనున్న ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఏఐఎఫ్ బి రాష్ట్ర ఉపాధ్యకుడు అంబటి జోజి రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం కరీంనగర్ నగరంలోని ఏ ఐ ఎఫ్ బి  ఉత్తర తెలంగాణ కార్యాలయంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు గవ్వ వంశీధర్ రెడ్డి తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ జాతీయ మహాసభలకు దేశ వ్యాప్తంగా 500కు పైగా ప్రతినిధులు రానున్నట్లు తెలిపారు.

మరో 25 దేశాల నుండి ప్రతినిధులు వస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ ప్రత్యమ్యాయ శక్తిగా ఎదగనుందని  పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల లో తెలంగాణ లో 119 స్థానాలలో పోటీ చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కొత్త సీసాలో పాత సారా పోసినట్లు ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ 9 ఏళ్ళ పాలన లో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.

కొత్త బడ్జెట్ కేసీఆర్ కుటుంబం కోసం చేసిన బడ్జెట్ గా ఉందని అన్నారు. గిరిజనులను అవమానించే విధంగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. వెంటనే సీఎం కేసీఆర్ గిరిజన సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణాలో జర్నలిస్ట్ ఇళ్ల స్థలాలు ఇస్తామని మళ్ళీ నమ్మిస్తున్నాడని. కేసీఆర్ మాటలు నమ్మవద్దన్నారు. తెలంగాణ లో వైశ్య కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ చొప్పదండి కన్వీనర్ పెద్దేళ్లి శేఖర్, జిల్లా ఆర్గనైజిన్గ్ సెక్రటరీ పులిమాటి సంతోష్ కుమార్, టి యు సిసి జిల్లా అధ్యక్షులు సత్యరావ్ మరియు జిల్లా కార్యదర్శి శంకర్ కురువెల్లి , పార్టీ సభ్యులు లింగమూర్తి, కిషన్ బాబు, వినయ్, రమేష్, హరీష్, వాసు, రాజు, విజయ్, బుచ్చి రావ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.