నూతన ఇన్చార్జీలను సన్మానించిన 'వంచ'

నూతన ఇన్చార్జీలను సన్మానించిన 'వంచ'

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంఛార్జీలుగా నూతనంగా నియామకమైన గంగాధర కనకయ్య(కరీంనగర్),ఆవునూరు దయాకర్ రావులను ఆ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అబ్జర్వర్ వంచ శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం పార్టీ కార్యాలయంలో శాలువాలు కప్పి సన్మానించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దామెర సత్యం, పార్టీ నాయకులు రొడ్డ శ్రీనివాస్, సూర్య నాయక్, రొడ్డ శ్రీధర్ నారాయణ గౌడ్, సందబోయిన రాజేశం,ఎలిమిల్లి కిషన్  తదితరులు పాల్గొన్నారు.