మోర్చాల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి

మోర్చాల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి
  • మోర్చాల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి

ముద్ర, జమ్మికుంట:-హుజురాబాద్ పట్టణంలో  హుజరాబాద్ మండల బిజెపి మోర్చా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల సమావేశం హుజురాబాద్ లో జరిగింది. సమావేశానికి ముఖ్య అతిధులుగా వచ్చిన బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు మాట్లాడుతూ ఈనెల 23వ తేదీ రోజున జమ్మికుంట లోని శంకర్ నందన గార్డెన్లో జరిగే నియోజకవర్గ స్థాయి మోర్చాలా సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. కేంద్రంలోని  నరేంద్ర మోడీ  ప్రభుత్వం 9 సంవత్సర కాలంలో అనేక రకాల ప్రజా సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందని, ముఖ్యంగా పేద ప్రజల కొరకు ఉచిత రేషన్ బియ్యం, ఆయుష్మాన్ భారత్,ఉచిత వ్యాక్సినేషన్, లాంటి పథకాలతో పాటు రైతుల కొరకు  సబ్సిడీ ఎరువులు, ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి కృషి పింఛన్ యోజన, సాయిల్ హెల్త్ కార్డులు. మహిళలకు ఉజ్జ్వల యోజన పథకం,శ్రీనిధి పథకం,వడ్డీ లేని రుణాలు,మాతృ వందన యోజన లాంటి అనేక రకాల ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత మోడీ  ప్రభుత్వానిధని సంపత్ రావు కొనియాడారు. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.హుజురాబాద్ నియోజకవర్గ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు కష్టపడి పని చేస్తే తెలంగాణలో రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని అన్నారు. ఆ దిశగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు,బిజెపి హుజురాబాద్ అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతంరెడ్డి ,హుజురాబాద్ మండల బిజెపి అధ్యక్షులు రాముల కుమార్, మండల ప్రధాన కార్యదర్శి పారిపల్లి కొండాల్ రెడ్డి,మండల ఉపాధ్యక్షుడు ముప్పు మహేష్, యువ మోర్చా మండల అధ్యక్షుడు నరేడ్ల చైతన్య రెడ్డి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు సాయిబాబా, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు చిదురాల రాణి రెడ్డి, మైనారిటీ మోర్చా మండల అధ్యక్షుడు మహమ్మద్ నూరుల్లా, కిసాన్ మోర్చ మండల ప్రధాన కార్యదర్శి చిధురాల సుధాకర్,మైనార్టీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి  మహ్మద్ సర్వర్, పెరుమాల్ల దేవ గౌడ, వడిగే రాకేష్ తదితరులు పాల్గొన్నారు.