డిజిపి కి స్వాగతం పలికిన పోలీస్ కమీషనర్

డిజిపి కి స్వాగతం పలికిన పోలీస్ కమీషనర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కోమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు పర్యటనకు హాజరయ్యేందుకు  వెళ్తున్న రాష్ట్ర డిజిపి అంజని కుమార్  శుక్రవారం మార్గం మధ్యలో కరీంనగర్ కు వచ్చారు. ఈ సందర్భంగా కమీషనరేట్ కేంద్రంలో డిజిపి గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బారాయుడు పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం జ్ఞాపిక అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏసిపి లు తుల శ్రీనివాసరావు, బి విజయకుమార్, సి ప్రతాప్ ఆర్ఐ ఎం సురేష్ తదితరులు పాల్గొన్నారు.