కౌలు రైతులకు రుణమాఫీ వర్తింపజేయాలి

కౌలు రైతులకు రుణమాఫీ వర్తింపజేయాలి

ముద్ర, హుజురాబాద్: రాష్ట్రంలోని కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కార్యదర్శివర్గ సభ్యులు గీట్ల ముకుందరెడ్డి, హుజూరాబాద్ జోన్ కమిటీ కార్యదర్శి వెలురెడ్డి రాజిరెడ్డిలు డిమాండ్ చేశారు. గురువారం సీపీఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ... ఏపీ కౌలుదారి చట్టం-2011న్లు పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వారికి కౌలు రైతు గుర్తింపు కార్డులన పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అర్హులైన కౌలు రైతులు బ్యాంకుల ద్వారా రుణం పొందారని తెలిపారు. బ్యాంకర్ల నుంచి కౌలు రైతుల రుణాల వివరాలను సేకరించి, వాటిని రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన కౌలు రైతులకు నష్టపరిహారం ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పి, ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు. ఈ సమావేశంలో నాయకులు దుర్గా ప్రసాద్. కదిరే రమేష్, పిట్టల తిరుపతి, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.