తమిళనాడు విస్తరక్ లకు వీడ్కోలు

తమిళనాడు విస్తరక్ లకు వీడ్కోలు
  • బీజేపీ సంస్థాగత బలోపేతమే లక్ష్యం
  • బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :భారతీయ జనతా జాతీయ పార్టీ సూచన మేరకు పార్టీ సంస్థాగత అంశాల పరిశీలన కోసం తమిళనాడు నుండి  కరీంనగర్ జిల్లాకు వచ్చి,  పార్టీ సూచించిన మేరకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేసిన  విస్తరాక్ లను బుధవారం కరీంనగర్ లో బిజెపి శ్రేణులు ఘనంగా సన్మానించి, వీడ్కోలు పలికారు.  ముఖ్యంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం భూపాల్ లో ప్రధాని మోదీ నిర్వహించిన  మేరా బూత్ సబ్ సే మస్బూత్ కార్యక్రమానంతరం కరీంనగర్ జిల్లా బిజెపి సంస్థాగత అంశాల పరిశీలనకు తమిళనాడు విస్తారక్ లు  వచ్చారు. ఈ సందర్భంగా ఆయా విస్తారక్ లకు  వారికి కేటాయించిన మండలాలలో పర్యటించి,  క్షేత్రస్థాయిలో పార్టీ సంస్థాగత విషయాలను సేకరించారు. గత వారం రోజులుగా ఇట్టి కార్యక్రమాన్ని  దిగ్విజయవంతంగా పూర్తి కొని నేడు తమిళనాడు రాష్ట్రానికి బయలుదేరుతున్న సందర్భంగా  కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బిజెపి శ్రేణులందరూ విస్తారక్ ల ను శాలువాతో సత్కరించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగాబిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు శ్రీ గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సంస్థాగత బలోపేతం లక్ష్యంగా జాతీయ నాయకత్వం తగిన కార్యచరణతో ముందుకు వెళుతుందన్నారు. ఆ దిశగానే లోగడ బూత్ మహా సమ్మేళనం, స్ట్రీట్ కార్నర్ సమావేశాలు, మహా సంపర్క్ అభియాన్ , మేరా బూత్ సబ్ సే మజ్బుత్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా , మరిన్ని కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్ళనున్నట్లు చెప్పారు. జిల్లా సంస్థాగత విషయాల పరిశీలన కోసం వచ్చి, గత వారం రోజులుగా వారి సమయాన్ని కేటాయించన తమిళనాడు విస్తారక్ ల కు బిజెపి జిల్లా పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఆయన ఈ సందర్భంగా చెప్పారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్లెం వాసుదేవ రెడ్డి, కరీంనగర్ అసెంబ్లీ కన్వీ నర్ దుబాల శ్రీనివాస్, చొప్పదండి అసెంబ్లీ కన్వీనర్ పెరుక శ్రావణ్, ఈస్ట్ జోన్ బిజెపి అధ్యక్షులు ఆవుదుర్తి శ్రీనివాస్, సౌత్ జోన్ ప్రధాన కార్యదర్శి పురం హరి తదితరులు పాల్గొన్నారు.