యోగ సాధన చేద్దాం.. ఆరోగ్య సిద్ధిపేటను నిర్మిద్దాం...

యోగ సాధన చేద్దాం.. ఆరోగ్య సిద్ధిపేటను నిర్మిద్దాం...
  • ఆనంద యోగ  గోడపత్రిక ఆవిష్కరించిన మంత్రి 

ముద్ర ప్రతినిధి:సిద్దిపేట:శారీరక,మానసిక ఆరోగ్యానికి అద్భుతంగా ఉపయోగ పడే యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని రాష్ట్ర ఆర్థిక,వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం సిద్దిపేటలోని క్యాంప్ ఆఫీస్ లో ఆనంద యోగ హ్యాపీనెస్ ప్రోగ్రామ్ ఉచిత యోగ శిక్షణ శిబిరం గోడపత్రికను మంత్రి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సిద్దిపేట లక్ష్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నామని స్వచ్ఛ సిద్దిపేట నిర్మాణం కోసం కృషి జరుగుతుందని తెలిపారు.అదే విధంగా ప్రజలందరూ యోగాసనాలను నిరంతరం సాధన చేస్తూ ఆరోగ్యంగా ఉండడం అనివార్యమన్నారు . త్వరలోనే ఈ శిబిరాలు పట్టణంలోని అన్ని వార్డులలో నిర్వహించేదుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఈ శిబిరాల్లో పరిసరవాసులందరూ కుల,మత,లింగ బెదలకు అతీతంగా అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. యోగ సాధన నిరంతరం చేసేవారికి తగిన సౌకర్యాలను అందిస్తామని చెప్పారు. శిక్షణ శిబిరాల్లో పాల్గొనే వారికి అవసరమైన సహాయాలను అందిస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

జూలై 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ హరిప్రియ నగర్ లో, ఉదయం 5:30 నుండి 6:30 వరకు ఉచిత యోగా శిబిరాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బారసపార్టీ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి , 22వ వార్డు కౌన్సిలర్ ఎడ్ల అరవింద్ రెడ్డి ,సిద్దిపేట జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు తోట అశోక్ ,గౌరవ అధ్యక్షులు కొమురవెల్లి అంజయ్య,చీఫ్ పాట్రన్ చిప్ప ప్రభాకర్,వ్యాస మహర్షి యోగా సొసైటీ అధ్యక్షులు నిమ్మ శ్రీనివాస్ రెడ్డి , యోగా శిక్షకులు రాష్ట్ర యోగ అధ్యయన పరిషత్ సభ్యులు తోట సతీష్,యోగ అసోసియేషన్ సభ్యులు మహిపాల్ రెడ్డి ,లింగమూర్తి మున్సిపల్ మాజీ చైర్మన్ కడవెరుగు రాజనర్సు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ కాశీనాథ్ పాల్గొన్నారు.