అక్రమ ఇసుక తవ్వకాలు తక్షణమే ఆపాలి

అక్రమ ఇసుక తవ్వకాలు తక్షణమే ఆపాలి

ముద్ర ,జమ్మికుంట: వీణవంక మండలంలోని, జమ్మికుంట మండలంలోని ఎనిమిది చోట్ల ఇసుక క్వారీలు అనుమతి ఉన్నాయి మల్లారెడ్డి పల్లి చల్లూరు కొండపాక పోతిరెడ్డిపల్లి కలపల్లి వావిలాల గ్రామాల్లో ఇసుక తవ్వకాలు మొదలుపెట్టారు టి.ఎస్.ఎం.డి.సి ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని ఎస్ జి టి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు ఎస్ జి టి 28 ఏప్రిల్ లో జారీ చేసిన మద్యంతర ఉత్తర్వులలో పర్యావరణ అనుమతులు లేనిదే మానేరులో తవ్వకాలు చేపట్టొద్దని కరీంనగర్ జిల్లా కలెక్టర్ లివర్ సౌండ్ కమిటీ చైర్మన్ హోదాలో జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తు అభ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది జిల్లా కలెక్టర్ ఎస్ జి టి జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని ఆ ప్రాంత రైతులు కోరుచున్నారు.

 జిల్లా కలెక్టర్ ఆదేశాలను అమలు పరచకుండా జమ్మికుంట మండలంలో తనుగుల మరియు వావిలాలలో అక్రమ ఇసుక రవాణా అరికట్టడంలో విఫలమైన మండల అధికారుల అండదండలలో రోజుకు 50 లారీలు అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక మాఫియా లక్షలాది రూపాయల ఇసుకను రోజుకు తరలిస్తున్నారు వీణవంక, చల్లూరు ,మల్లారెడ్డిపల్లి, కొండపాక ,కల్పల్లె ,కోర్కల్, జమ్మికుంట మండలాలలో విలాసాగర్ ,తనుగుల, గండ్రపల్లి గ్రామాల్లో 400 వందల ట్రాక్టర్లు రోజుకు ఐదు ట్రిప్పుల చొప్పున లక్షలాది విలువచేసే ఇసుక అక్రమ రవాణా తక్షణమే అదుపు చేయాలని కోరారు ఓవర్లోడ్ ఇసుక లారీల వలన రోడ్డు గుంతలమయం అవుతుందని తెలిపారు మల్లారెడ్డిపల్లి ,కోర్కల్, కొండపాకపల్లి ఇసుక స్టాక్ రవాణా చేయకుండా జిల్లా యంత్రాంగం ఎస్ జి టిఉ త్తర్వులు అమలు చేయాలి లేనియెడల మాజీ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి పెద్ద ఎత్తున రైతులతో ఆందోళన చేయాల్సి వస్తుందని తెలిపారు.