కరీంనగర్ స్మార్ట్ సిటీ వందల కోట్లతో  అభివృద్ధి

కరీంనగర్ స్మార్ట్ సిటీ వందల కోట్లతో  అభివృద్ధి
  • ఎల్కతుర్తి- సిద్దిపేట రహదారిన అభివృద్ధి కేంద్రానిదే
  • రాబోయే ఎన్నికల్లో  మోర్చాల సత్తా చాటండి
  • మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ 

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ పట్టణ చరిత్రలో జరగని అభివృద్ధి పనులు నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ హయాంలో జరుగుతున్నాయని , మోడీ ప్రభుత్వం కరీంనగర్ పట్టణానికి స్మార్ట్ సిటీ హోదా కల్పించడంతో వందల కోట్ల నిధులతో నగరం లో విస్తృత  అభివృద్ధి పనులు  కొనసాగుతున్నాయని మాజీ కేంద్ర మంత్రి,రాజ్యసభ సభ్యులు ప్రకాష్ జవదేకర్ అన్నారు. మహా జన్ సంపర్క్ అభియాన్ , వికాస్ తీర్ద్ ప్రోగ్రాం లో భాగంగా సోమవారం స్మార్ట్ సిటీ పనుల కింద  కరీంనగర్ పట్టణంలో  జరుగుతున్న అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ , బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా జేవదేకర్  మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం  అన్ని రంగాల వికాసానికి తొమ్మిదేళ్లలో అనేక బాటలు వేసిందన్నారు. 

ముఖ్యంగా వికాస్ తీర్డ్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులను   పరిశీలన చేయడం జరిగిందన్నారు. స్మార్ట్ సిటీ పనులతో కరీంనగర్ అభివృద్ధి, వికాసానికి మోడీ ప్రభుత్వం కొత్త బాటలు వేసిందన్నారు. వికాస్ తీర్ద్ కార్యక్రమంలో భాగంగా  578 కోట్లతో జరుగుతున్న ఎల్కతుర్తి,- సిద్దిపేట జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించారు.  భారతీయ జనతా పార్టీకి వివిధ మోర్చ లు మూల స్తంభాలాంటివన్నారు. పార్టీ మోర్చా బాధ్యులందరూ 9 ఏళ్ల మోడీ ప్రభుత్వ విజయాలు, కీర్తిని , ప్రగతిని  దేశానికి చేసిన మంచిని ప్రతి ఒక్కరి దృష్టికి తీసుక వెళ్లడానికి నిరంతరం కృషి చేయాలన్నారు మోర్ఛ లు సంఘటితశక్తిగా  తయారు కావాలని, రాబోయే రోజుల్లో మోర్చాల శక్తి చాటి చెప్పాలని, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.