వైద్యుని నిర్లక్ష్యం వల్ల వ్యక్తి మృతి.. ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన

వైద్యుని నిర్లక్ష్యం వల్ల వ్యక్తి మృతి.. ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన
  • పోలీసులు డాక్టరు కుమ్మక్కయ్యాడంటూ ఆరోపణలు
  • మృతి చెందిన ధోనికేనా మొగిలి
  • వివరాలు వెల్లడిస్తున్న సమీప బంధువులు

ముద్ర, జమ్మికుంట : జమ్మికుంట పట్టణములోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో వైద్యుని నిర్లక్ష్యం వల్ల వ్యక్తి మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం సైదాపూర్ మండలానికి చెందిన ధోనికాన మొగిలి 55 అనే వ్యక్తి మూడు రోజుల క్రితం పురుగుల మందు సేవించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రి వైద్యులు చికిత్స అందించే క్రమంలో నిర్లక్ష్యం చేయడం వల్లనే మృతి చెందాడంటూ బంధువులు బుధవారం ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మంగళవారం సాయంత్రం శ్వాస సరిగా రావడం లేదంటూ ఆసుపత్రి వైద్యులు తెలిపారని, వెంటిలేటర్ చికిత్స అవసరమని దానికోసం ప్రతి రోజు 30 వేల రూపాయలు అదనంగా ఖర్చు అవుతుందని తెలిపినట్లు బాధితులు తెలిపారు. ఈ క్రమంలో చికిత్స అందిస్తుండగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే మొగిలి మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. ఈ విషయంలో పోలీసులు సైతం డాక్టర్కు సహకరిస్తున్నారని వారిద్దరూ కొమ్మక్కవ్వడం వల్లనే తమ ఆత్మీయుడు మృతి చెందాడని బంధువులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తగిన న్యాయం చేయాలని బాధితులు కోరుకుంటున్నారు. కాగా అర్ధరాత్రి నుండి ఆసుపత్రి వద్దనే బంధువులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.