కవితకు ఈడీ నోటీసులు ఇస్తే తప్పేమిటి? 

కవితకు ఈడీ నోటీసులు ఇస్తే తప్పేమిటి? 

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో   ఎమ్మెల్సీ  కవితకు  ఈడీ నోటీసులు  ఇస్తే తప్పేమిటని   కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ప్రశ్నించారు.  బుధవారం   న్యూఢిల్లీలో  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  కవితకు  ఈడీ నోటీసులతో  తమ పార్టీకి  ఎలాంటి సంబంధం లేదని  ఆయన స్పష్టం  చేశారు.   మీ తప్పులను  ప్రశ్నిస్తే  తెలంగాణ సమాజానికి  ఆపాదిస్తారా అని  కిషన్ రెడ్డి  ప్రశ్నించారు.  అవినీతి అంశాన్ని తెలంగాణ సమాజంతో  ముడిపెడుతున్నారన్నారు.   ఈ రకంగా  తెలంగాణ సమాజాన్ని  రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన  ఆరోపించారు.  లిక్కర్ వ్యాపారం  చేసింది మీరు,  అక్రమ సంపాదన  చేసింది  మీరేనని కవితనుద్దేశించి  కిషన్ రెడ్డి  ఆరోపణలు  చేశారు.  ఢిల్లీ లిక్కర్ పాలసీలో  భాగస్వాములై   సంపాదించారన్నారు.   చట్టం ముందు అందరూ  సమానమేనని  కిషన్ రెడ్డి  చెప్పారు.   దర్యాప్తు సంస్థల విషయంలో తాము జోక్యం  చేసుకోబోమని  కిషన్ రెడ్డి స్పష్టం  చేశారు.  అవినీతి అంశాన్ని తెలంగాణ సమాజంతో  ముడిపెడుతున్నారన్నారు