ఆర్​ఆర్​ఆర్​చిత్ర యూనిట్​కు ప్రధాని ప్రశంసలు

ఆర్​ఆర్​ఆర్​చిత్ర యూనిట్​కు ప్రధాని ప్రశంసలు

ఆస్కార్‌ అవార్డులపై తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ట్రిపులార్‌ చిత్రయూనిట్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ‘నాటు నాటు’ సాంగ్‌కు ఆస్కార్‌ దక్కడంపై ట్వీట్‌ చేసిన ప్రధాని.. ‘ఇది అసాధారణం. నాటు నాటు పాటకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కింది. ఇది రాబోయే సంవత్సరాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాట అవుతుంది. ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి అభినందనలు. భారతదేశం గర్వంతో ఉప్పొంగుతుంది’ అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.