సంస్కృతి సాంప్రదాయలకు ప్రతిక తీజ్ ఉత్సవాలు: మేయర్ యాదగిరి సునీల్ రావు. 

సంస్కృతి సాంప్రదాయలకు ప్రతిక తీజ్ ఉత్సవాలు: మేయర్ యాదగిరి సునీల్ రావు. 

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : ఆధునిక ప్రపంచంలో తమ సాంప్రదాయలను కాపాడుకుంటూ గిరిజనులు ప్రతి ఏటా తీజ్ ఉత్సవాలను వైభవంగా చేస్తారని మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో బంజారాలు తమ సంస్కృతి, సాంప్రదాలకు ప్రతికగా తొమ్మిది రోజుల పాటు తీజ్ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా గురువారం రోజు కరీంనగర్ నగరంలో గిరిజనుల తీజ్ ఉత్సవాలను ఘనంగా జరిగాయి. నగరంలోని 9 వ డివిజన్ కోతిరాంపూర్, 16 వ డివిజన్ రాంనగర్ లో జరిగిన తీజ్ వేడుకల్లో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక కార్పోరేటర్లు ఐలేంధర్ యాదవ్, బోనాల శ్రీకాంత్, గిరిజనులతో కలిసి వారి సాంప్రదాయం ప్రకారం మొలకెత్తిన గోదుమ నారు బుట్టలకు, సేవా లాల్ మహరాజ్ కు ప్రత్యేక పూజలు చేశారు. 

మొలకెత్తిన గోదుమ బుట్టలను యువతులు, మహిళల నెత్తిన ఎత్తి తీజ్ ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం బంజార యువతులు, మహిళలతో కలిసి మేయర్ యాదగిరి సునీల్ రావు సాంప్రదాయ నృత్యాలు చేస్తూ... సంధడి చేశారు. ఈ సంధర్బంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ గిరిజన యువతులు మంచి వరుడు రావాలని ఆయురారోగ్యాలు కలగాలని దైవాన్ని కోరుతూ ప్రతి ఏటా సాంప్రదాయ పద్దతిలో చేసే ఉత్సవాలే తీజ్ ఉత్సవాలన్నారు. ప్రతి గిరిజన యువతులు, మహిళలు తొమ్మిది రోజల పాటు అత్యంత నిష్ఠగా ఉపవాసలు చేస్తూ... ఆకుకూరలతో సజ్జ రొట్టెలతో తొమ్మిది రోజులు తమ ఇష్టదైవానికి ప్రత్యేక పూజలు చేస్తారని తెలిపారు. 

వెదులు బుట్టల్లొ పుట్టమట్టిని తెచ్చి... గోదుమలు పోసి అవి మొలకెత్తే వరకు తొమ్మిది రోజులు పూజలు చేయడం బంజార గిరిజనుల ఆనవాయితీ అన్నారు. ప్రతి ఏటా శ్రావణ మాసం ఆగస్టు నెలలో తీజ్ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారని తెలిపారు. గిరిజనుల కుటుంబాలు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని తీజ్ వేడుకల్లో ప్రత్యేక పూజలు చేస్తారని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం లో తీజ్ ఉత్సవాలకు మరింత ఆధరణ పేరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రూప్ సింగ్, బంజాల మహిళలు, యువతి యువకులు, పురుషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.