సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర భారీ భద్రత

సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర భారీ భద్రత

బాలీవుడ్  స్టార్ హీరో సల్మాన్ ఖాన్కు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు రావడంతో ముంబై పోలీసులు ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.  ఇప్పటికే సల్మాన్ ఖాన్ కార్యాలయానికి బెదిరింపు ఈ మెయిల్స్​ పంపినందుకు జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్ స్టర్లు లారెన్స్ బిఫ్ణోయ్, గోల్డీ బ్రార్, రోహిత్ గార్గ్లపై బాంద్రా పోలీసులు కేసు నమోదు చేశారు.  ఐపీసీ 506(2), 120 (బీ) 34 సెక్షన్ ల కింద ఎఫ్ఐఆర్లు  నమోదు చేశారు.  ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్కు  ముప్పు ఉందని గుర్తించిన ముంబై పోలీసులు ఆయన నివాసం వద్ద వై ప్లస్ కేటగిరి భద్రతను కల్పించారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి సల్మాన్కు బెదిరింపులు రావడంతో మహరాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు భద్రత కల్పించింది.