పాత వాహనాలు  ఇక చెత్త కుప్పలోకి....

పాత వాహనాలు  ఇక చెత్త కుప్పలోకి....
Old vehicles are now in the garbage

15 ఏళ్లు దాటిన వాహనాలను ఇక మీదట తుప్పు కింద అమ్మేయాల్సిందే. దీనికి సంబంధించిన చట్టాన్ని ఇదివరకే ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం దీన్ని ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈరోజు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి స్క్రాపేజ్ వెహికల్ పాలసీని ప్రకటించారు.

కాలుష్య నివారణ కోసం క్లీన్ ఎనర్జీ వాహనాల అమ్మకాలను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. పథకం కింద స్క్రాప్ చేసిన వాహనాలను రీసైకిల్ చేసి మెటల్, రబ్బర్, గాజు మొదలైన వస్తువులను విడదీస్తారు. వాటిని వాహనాల తయారీ కోసం తిరిగి వాడుకలోకి తెస్తారు. దీనికి సంబంధించి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు.