ఆగస్ట్​ 20  న సీటెట్ పరీక్ష

ఆగస్ట్​ 20  న సీటెట్ పరీక్ష
  • ఈ నెల 18 నుంచి  హాల్‌టికెట్లు
  • దేశ వ్యాప్తంగా 73 నగరాల్లో ఎగ్జామ్​ 
  • ప్రకటించిన సీబీఎస్‌ఈ 

న్యూఢిల్లీ :  సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) ఆగస్టు-2023 పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ఆగస్టు 18న విడుదల చేయనుంది. అభ్యర్థుల హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. సీటెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ పొందవచ్చు.  సీబీఎస్‌ఈ ఆగస్టు 1న అభ్యర్థులకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ (ప్రీ-అడ్మిట్ కార్డ్) విడుదల చేసిన సంగతి తెలిసిందే. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డు వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డు లేనిదే పరీక్ష రాయడానికి అనుమతి ఉండదు. అభ్యర్థులు పరీక్ష రోజున అడ్మిట్ కార్డును మర్చిపోకూడదు. అడ్మిట్ కార్డుతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తీసుకెళ్లడం మంచింది.  ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 20న ఓఎంఆర్ విధానంలో సీటెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆగస్టు 20న రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్ష ని ర్వహించనున్నారు  మొత్తం 73 నగరాల్లోని 211 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 20 భాషల్లో సీటెట్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది సీటెట్ పరీక్ష కోసం 32.45 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.