మణిపూర్​లో 1195 ఆయుధాల స్వాధీనం

మణిపూర్​లో 1195 ఆయుధాల స్వాధీనం
  • 10 కంపెనీల సెంట్రల్​ఫోర్స్​మోహరింపు

మణిపూర్​: మణిపూర్​లో చెలరేగుతున్న హింస కారణంగా కేంద్రం అదనంగా మరో 10 కంపెనీల సెంట్రల్​ ఫోర్స్​ను శనివారం మోహరించింది. కాగా పోలీసులు, సెర్చ్​ఆపరేషన్​లో ఇటీవలే ఎత్తుకెళ్లిన 1195 ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. కాగా ఈ సెర్చ్​ ఆపరేషన్​ఆదివారం ఉదయం వరకూ కొనసాగడం విశేషం. మరోవైపు 10 కంపెనీల బలగాల్లో సీఆర్​పీఎఫ్​5 టీమ్​లు, బీఎస్​ఎఫ్​కు చెందిన 3, ఐటీబీపీ, ఎస్​ఎస్​బీకి చెందిన ఒక్కో కంపెనీని అదనంగా నియమించింది.  నరంసేన పోలీస్ స్టేషన్‌లపై దాడి చేసి 685 ఆయుధాలు, 20 వేలకు పైగా కాట్రిడ్జ్‌లను దుండగులు దోచుకున్నారు. ఆయుధాల్లో ఏకే-47, ఇన్సాస్ రైఫిల్స్, హ్యాండ్ గన్లు, మోర్టార్లు, కార్బైన్లు, హ్యాండ్ గ్రెనేడ్లు, బాంబులు ఉన్నాయి. రాష్ట్రంలోని లోయలోని పోలీస్ స్టేషన్లే కాకుండా కొండపాక జిల్లాల్లోనూ దోపిడీలు జరుగుతున్నాయని పోలీస్ కంట్రోల్ రూం వెల్లడించింది. ఈ ఆయుధాలను స్వాధీనం చేసుకునేందుకు భద్రతా బలగాలు కొండలు, లోయ ప్రాంతాల్లో నిరంతరం సోదాలు ముమ్మరం చేశారు.