త్యాగాలకు ప్రతీక సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్.. బంజారాలకు ప్రభుత్వం అండ- మంత్రి గంగుల కమలాకర్

త్యాగాలకు ప్రతీక సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్.. బంజారాలకు ప్రభుత్వం అండ- మంత్రి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : త్యాగాలకు మారుపేరు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ అని, బంజారా లకు ఆరాధ్య దైవము సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ అని, బంజారా లకు ప్రభుత్వం అండదండగా ఉంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి కమలాకర్ అన్నారు.శుక్రవారం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్  284 వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని స్థానిక సప్తగిరి కాలనీ లోని సంత్ శ్రీ సేవాలాల్ మందిర స్థలంలో నిర్వహించిన ఉత్సవాలకు మంత్రి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ శ్రీ సేవాలాల్ మహారాజ్ త్యాగాలకు ప్రతీక అని ధైర్యానికి మారుపేరు అని కొనియాడారు. దేశం కోసం బంజారాలు  ప్రాణత్యాగాలు చేశారని అన్నారు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్రను భావితరాలకు తెలియ చెప్పాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు తెలంగాణ రాష్ట్రం  వచ్చాక ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు జంతు హింస వద్దని, హిందూ ధర్మం కోసం దేశమంతా ప్రచారం చేసిన మహనీయుడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ అని మంత్రి తెలిపారు.

బంజారాలు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ మందిర, భవన నిర్మాణం చేసుకునేందుకు గాను ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన రూ. 30 లక్షల కేటాయించి నట్లు వెల్లడించారు.
ప్రొసీడింగ్స్ ను మంత్రి సభాముఖంగా బంజారా నాయకులకు అందజేశారు. ప్రస్తుతం ఇచ్చిన నిధులతో భవన నిర్మాణం ప్రారంభించాలని, ఇంకా అవసరమైన నిధులను ప్రభుత్వం నుంచి తెచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ముందుగా మంత్రి  బంజారాలు  నిర్వహించిన హోమం  కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు. డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి హరి శంకర్, కార్పొరేటర్ దిండిగాల మహేష్, చింతకుంట ఎంపిటిసి తిరుపతి నాయక్ ల తో కలిసి పాల్గొన్నారు.

మొదటగా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ వై. సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప హరీశంకర్, కార్పొరేటర్ డి. మహేష్ , కార్పోరేటర్లు, సభాధ్యక్షుడు ఎం పి టి సి తిరుపతి నాయక్, ఉత్సవ కమిటీ నాయకులు , లక్ పతి నాయక్, భాస్కర్ నాయక్, డిటీ నాయక్, బీమా సాహెబ్, తిరుపతి, రాజు నాయక్, రవి నాయక్, సంతోష్ నాయక్, శంకర్ నాయక్,  తదితరులు పాల్గొన్నారు.