కేబుల్ బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి కావాలి-  జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్

కేబుల్ బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి కావాలి-  జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్

ముద్ర ప్రతినిధి కరీంనగర్ :కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ పనులను త్వరితగతంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు.

ఆదివారం కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులను పరిశీలించి, నిర్మాణ పనులలో వేగంపెంచాలని తెలిపారు.  డైనమిక్ లైటింగ్, కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. కచ్చితమైన నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు .

ఈ కార్యక్రమంలో  ఈఈ ఆర్ అండ్ బి సాంబశివరావు తదితరులు పాల్గోన్నారు.