కరీంనగర్ ను అద్భుత నగరంగా తీర్చి దిద్దుతాం

కరీంనగర్ ను అద్భుత నగరంగా తీర్చి దిద్దుతాం
  • శభాష్ అనే విధంగా అభివృద్ధి
  • కరీంనగర్ రూపు రేఖలు మార్చుతున్నాము
  • మంత్రి గంగుల కమలాకర్  

ముద్ర ప్రతినిధి కరీంనగర్ :

రానున్న రోజుల్లో కరీంనగర్ నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తమని బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.

 ఆదివారం నగర పాలక సంస్థ 14,59 వ డివిజన్ లలో పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ యాదగిరి సునీల్ రావు తో కలసి మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ చేసారు. 59 వ డివిజన్ లో 10లక్షలతో సీసీ రోడ్డు పనులకు, వెంకటేశ్వర ఆలయ తోరణం నిర్మాణ పనులకు,14 వ డివిజన్ లో 19లక్షలతో సీసీ రోడ్డు,10 లక్షలతో రెడ్డి సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ చేసారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం లో మంత్రి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం కరీంనగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని అన్నారు. తెలంగాణ రాకముందు కరీంనగర్ లో అభివృద్ధి లేదు అని నిరంతరం ప్రజల మధ్యలో ఉండి సేవ చేస్తున్నానని గుర్తు చేశారు. ప్రజల సహకారంతో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని తనను గెలిపించిన ప్రజలు శభాష్ అనే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. నగరంలో సీఎం సహకారంతో నగర రోడ్లను అద్భుతంగా తీర్చిదిద్దామని అన్నారు. ఐదు సంవత్సరాల కాలంలో నగర రూపురేఖలని మారిపోయాయని ఇప్పటికే కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందని మానేరు రివర్ ఫ్రంట్ పూర్తి అయితే కరీంనగర్ పర్యాటకంగా రూపుదిద్దుకుంటుందని అన్నారు. వచ్చే నెలలో టీటీడీ సహకారంతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణపనులను ప్రారంభిస్తామని అన్నారు.14డివిజన్ సప్తగిరి శ్రీనగర్ కాలనీ రెడ్డి సంక్షేమానికి ఇప్పటికే 10 లక్షలు కేటాయించామని అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించి భవన నిర్మాణ పనులు చేపడతామని అన్నారు. ఆరు నెలల్లో సంఘ భవనం నిర్మాణ పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. 14వ డివిజన్ లోని గౌడ సంఘం కాపు సంఘం, మహిళ సంఘం రజక సంఘ భవనాలకు ప్రభుత్వ భూమి తో పాటు వాటి నిర్మాణాలకు ఒక్కో భావనానికి 10 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఈ కార్యక్రమం లో కార్పొరేటర్లు దిండిగాల మహేష్, గందే మాధవి మహేష్ , బోనాల శ్రీకాంత్ రాజేందర్ రావు , ఐలందర్ యాదవ్ రెడ్డి సంక్షేమ సంఘం శ్రీనగర్ సప్తగిరి కాలనీ అధ్యక్షుడు చెన్నాడి రాజేశ్వర్ రెడ్డి, ఎడబోయిన శ్రీనివాసరెడ్డి, గడ్డం జగత్ పాల్ రెడ్డి,

 గడ్డం ప్రశాంత్ రెడ్డి, కోట భాస్కర్ రెడ్డి,

మొగుసాల వెంకటేశ్వర రెడ్డి,ముసుకుల రామకృష్ణారెడ్డి,

పోరెడ్డి శ్రీహరి రెడ్డి,చొల్లేటి పాపిరెడ్డి తదితర రెడ్డి భాందవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.