కార్పొరేషన్ కార్మికులకు  రేయిన్ కోట్ ల పంపిణీ

కార్పొరేషన్ కార్మికులకు  రేయిన్ కోట్ ల పంపిణీ

మేయర్ యాదగిరి సునీల్ రావు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : నగరపాలక సంస్థ ఉద్యోగులు, కార్మికుల రక్షణే కరీంనగర్ కార్పొరేషన్ ప్రధాన ద్యేయం అని  మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. తన కార్యాలయం వద్ద కార్పొరేటర్లతో కలిసి నగరపాలక సంస్థ కార్మికులకు రెయిన్ కోట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాల నేపథ్యంలో ఫీల్డ్ లెవల్ లో పనిచేసే వివిధ విభాగాల ఉద్యోగులకు, కార్మీక సిబ్బంది కి నగరపాలక సంస్థ రేయిట్ కోట్ ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.

వారి రక్షణే ద్యేయంగా నగరపాలక సంస్థ  8 లక్షల రూపాయల నిధులు వెచ్చించి 576 రేయిన్ కోట్ లను కొనుగోలు చేసి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.  నగరపాలక సంస్థ లో ఫీల్డ్ లెవల్ లో పని చేస్తున్న ఇంజనీరింగ్ మంచి నీటీ సరఫరా, టౌన్ ప్లానింగ్, ఎలక్ట్రానిక్, హరితహారం, పారిశుధ్యం, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్  విభాల్లో పని చేసే ఉద్యోగులు, సిబ్బంది మరియు కార్మీకులకు రేయిన్ కోట్ లను పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు జంగిలి సాగర్, కాశేట్టి లావణ్య శ్రీనివాస్ హరితహారం సిబ్బంది పాల్గొన్నారు.