పరిహారంపై బీజేపీ ఫైట్

పరిహారంపై బీజేపీ ఫైట్

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ బిజెపి జిల్లా శాఖ కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించింది. జిల్లాలో వరసగా కురుస్తున్న వడగండ్ల వానతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో మొదటిసారి కురిసిన వడగండ్లవాన కు నష్టపోయిన రైతులను స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎకరాకు 10 వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. ఇప్పటివరకు కూడా ఆ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కాలేదని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. రైతుల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి పంట నష్టం పై నివేదిక రూపొందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బిజెపి పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, ఉపాధ్యక్షులు మాడ వెంకటరెడ్డి, నాయకులు రమణారెడ్డి, కటకం లోకేష్, అజయ్ వర్మ, బొంతల కళ్యాణ చంద్ర తో పాటు పలువురు పాల్గొన్నారు.