ఉపాధి హామీ పథకాన్ని విస్మరించిన కేంద్ర బడ్జెట్

ఉపాధి హామీ పథకాన్ని విస్మరించిన కేంద్ర బడ్జెట్
* BK YNU State Secretary Koyada Srujan Kumar

బికె యంయు రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్

ముద్ర, కరీంనగర్ ప్రతినిధి: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీత రామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి  కొత పెట్టి ఉపాధి కూలీలను కూలీ పనులకు దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దేశాన్ని పాలిస్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వం సంపన్న వర్గాలకు కొమ్ము కాస్తూ పోరాడి సాధించుకున్న ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం  చేసేందుకు కుట్రలో భాగంగానే బడ్జెట్ కేటాయింపుల్లో అర కోరగా 60 వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి ఉపాధి పనులకు కోత పెడుతున్నారు. దేశంలో పేద బడుగు బలహీన వర్గాలకు ప్రతి రోజు కూలీ కల్పించి వారికి ఆర్ధిక తోడ్పాటును అందించే లక్ష్యంతో ఏర్పడ్డ ఉపాధి హామీ పథకం కూలీలకు 200 రోజులు పని కల్పించాల్సిన అవసరం ఉంది.

పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీల రేట్లను పెంచాలి. గ్రామీణ భారత అభివృద్ధిలో ఉపాధిహామీ పథకం కీలక పాత్ర పోషిస్తుందని గతంలో నీతి ఆయోగ్ స్పష్టం చేసిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం మరిచిపోయిందని, జాబ్ కార్డు ఉన్న ప్రతి కూలికి పని కల్పించడంలో,వేతనాలు చెల్లించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రభుత్వం పునరాలోచన చేసుకొని బడ్జెట్ కేటాయింపుల్లో సవరణ చేయాలని, ప్రతి ఒక్కరికి ఉపాధి పని కల్పించాలని సృజన్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.