ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
  • గడప గడపకు ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రచారం
  • హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు

చిగురుమామిడి ముద్ర న్యూస్: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా సెక్టొరల్ అధికారి ఆంజనేయులు, సర్పంచ్ వెంకట నర్సింహారెడ్డి,మండల విద్యాధికారి కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండలంలోని  ముల్కనూర్ గ్రామంలో శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా చివరి రోజు ఉపాధ్యాయులు ఇంటింటికి తిరుగుతూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు.ప్రభుత్వ పాఠశాలల్లో గల వసతుల గురించి వివరించారు. అలాగే విద్యార్థులకు ప్రభుత్వం ప్రతియేటా రెండు జతల దుస్తులు, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందిస్తుందని చెప్పారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అన్ని రకాల వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈకార్యక్రమంలో  కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మునిగంటి శోభారాణి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిఆర్పీలు,అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.