విలేజ్ బస్ ఆఫీసర్ విధానం అభినందనీయం - నిర్మల్ డి ఎస్ పి జీవన్ రెడ్డి

విలేజ్ బస్ ఆఫీసర్ విధానం అభినందనీయం - నిర్మల్ డి ఎస్ పి జీవన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: గ్రామీణ ప్రయాణికులకు ఆర్టీసి విలేజ్ బస్ ఆఫీసర్ విధానం అమలు చేయడం అభినందనీయమని నిర్మల్ డీ ఎస్పీ జీవన్ రెడ్డి అన్నారు. నిర్మల్ ఆర్టీసి డిపోలో శుక్రవారం ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రాంతాల ప్రజలకు ఈ పథకం ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. గ్రామాలకు వచ్చే బస్సుల సమయం విషయంలో, సౌకర్యాల విషయంలో వీరు ఆర్టీసికి ప్రజలకు అనుసంధానంగా ఉంటారన్నారు. డిపో మేనేజర్ సాయన్న మాట్లాడుతూ ఆర్టీసి సిబ్బంది ప్రజలకు సేవలందిస్తూ సంస్థను లాభాల బాటలో నడపాలన్నారు.