రసాభాసగా లక్ష్మణ చాంద మండల సమావేశం

రసాభాసగా లక్ష్మణ చాంద మండల సమావేశం
  • బిజెపి పాలిత పంచాయితీ లపై వివక్ష
  • నేలపై బైఠాయించిన సర్పంచులు

ముద్ర ప్రతినిధి,నిర్మల్: నిర్మల్ జిల్లా లక్ష్మణ చాంద మండల సమావేశం శుక్రవారం రసాభాసగా ముగిసింది. మండల సర్వసభ్య సమావేశం అడ్వాల పద్మ అధ్యక్షతన జరిగింది. సమావేశం ప్రారంభం కాగానే కొన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు మాట్లాడుతూ  అధికార పార్టీ కి అధికారులు వత్తాసు పలుకుతూ బిజెపి పాలిత గ్రామాల పట్ల వివక్ష చూపుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం నుండి విడుదలైన ఎన్ ఆర్ ఈ జీ ఎస్ నిధులను కేవలం అధికార పార్టీ సర్పంచుల కు మాత్రమే కేటాయించి, మునిపల్లె, లక్ష్మణ చాంద లకు కేటాయించక పోవటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, ఎంపిపి వైఖరికి నిరసనగా పోడియం వద్ద బైఠాయించారు. బైఠాయించిన వారిలో సురకంటి ముత్యం రెడ్డి,పద్మ వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ నర్సారెడ్డి తదితరులున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు కేవలం అధికార పార్టీ కార్యకర్తలుగా మారటం సరికాదన్నారు. ఈ వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు.