ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జే.ఏ.సీ. పిలుపు మేరకు ఆదివారం  కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గర్జనకు రాష్ట్ర౦ లొనీ వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన దగ్గరి నుండి నేటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించటంలో ప్రభుత్వానికి వెన్న ముక్కలాగా నిలిచారన్నారు. 

కరోన,వరదల వంటి విపత్కర పరిస్థితులలో  కుటుంబాలకు దూరంగా ఉంటూ రాత్రిం బవళ్ళు పనిచేశామని ఆవేదన వ్యక్తం చేశారు. బి ఆర్ ఏ బి ఆర్ ఓ ఎలక్ట్రిసిటీ ఆర్టీసీ సెర్ఫ్ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసుకున్నట్లే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ రాష్ట్రంలో ఉన్న ఎందరో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను బలి తీసుకుంటున్న ఏజెన్సి వ్యవస్థని తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. దీంతోపాటు హెల్త్ కార్డ్స్ ఉద్యోగ భద్రత ఇన్సూరెన్స్ వంటి పలు డిమాండ్ల నో ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు.