నాలుగో రోజుకు చేరిన కార్మికుల సమ్మె

నాలుగో రోజుకు చేరిన కార్మికుల సమ్మె

 శంకరపట్నం ముద్ర జూలై 9:  రాష్ట్ర ప్రభుత్వం జీవోను అమలు పరచాలని లేనియెడల ఆందోళన తీవ్రతరం చేస్తామని పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది హెచ్చరించారు. ఆదివారం నాటికి నాలుగో రోజుకు సమ్మె చేరింది. ఈ సమ్మె శంకరపట్నం మండల కేంద్రంలోఅంబేద్కర్ విగ్రహం ఎదురుగా జరుగుతుంది. తమను పర్మినెంట్ చేయాలని,  బడ్జెట్ కేటాయించి వేతనాలు ఇవ్వాలని కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శిగా నియమించాలని వారు డిమాండ్ చేశారు. పిఆర్సీలో నిర్ణయించిన మినిమం బేసిక్ ను 19వేలు వేతనంగా చెల్లించాలని ఆ జీవో నెంబర్ 60 ప్రకారం స్వీపర్లకు 15600 పంపు ఆపరేటర్లు ఎలక్ట్రిషన్ డ్రైవర్లు కారోబార్ బిల్ కలెక్టర్ 19 వేలను ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు.

ప్రమాదంలో మరణించిన కార్మికుల దహన సంస్కారాలకు 30 వేల రూపాయల ఆర్థిక సాయం చేయాలని కుటుంబంలోని  ఒకరికి ఉద్యోగం, ఇన్సూరెన్స్ పథకాన్ని ఐదు లక్షలకు పెంచాలని వారు విజ్ఞప్తి చేశారు. 8 గంటల పనితనాన్ని అమలు చేయాలని ,వారాంతపు సెలవులు, పండగ సెలవులు, జాతీయ అర్జిత సెలవును అమలు చేయాలని గ్రామపంచాయతీ కార్మికులు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని గ్రామపంచాయతీ సిబ్బందికి అన్ని కార్మిక చట్టాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని లేనియెడల ఆందోళన తీవ్రతరం చేస్తామని పారిశుద్ధ్య కార్మికులు హెచ్చరించారు.గ్రామపంచాయతీ సిబ్బందికి అన్ని కార్మిక చట్టాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమ్మెకు సిఐటియు నాయకులు మద్దతు ప్రకటించారు.