సేవే లక్ష్యంగా పని చేస్తున్న ప్రధాని మోడీ

సేవే లక్ష్యంగా పని చేస్తున్న ప్రధాని మోడీ

చిగురుమామిడి, ముద్రన్యూస్: ప్రధాని మోడీ తొమ్మిది సంవత్సరాల సుపరిపాలన సందర్భంగా మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం భారతీయ జనతా పార్టీ మండలంలోని కొండాపూర్ గ్రామంలో "గడప గడప"కు నరేంద్ర మోడి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, మరియు పథకాల గురించి గ్రామస్తులకు వివరించారు. తొమ్మిది సంవత్సరాల కాలంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, కరోనా సమయం నుండి ప్రధాన మంత్రి గరిబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా దేశ వ్యాప్తంగా 80కోట్ల మంది కి ఉచిత రేషన్ పేదలకు పంచుతుందన్నారు. ప్రధాన మంత్రి అవాస్ యోజన ద్వారా 3 కోట్ల పేద కుటుంభాలకు పక్క ఇండ్లు,11.8 కోట్ల గృహాలకు నల్లా నీరు అందిస్తుందన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ,విద్య సంస్థలలో ఈ డబ్ల్యూ ఎస్ వర్గాలకు 10 శాతం రిజ్వేషన్లు అమలు పరుస్తుందన్నారు.ప్రధాన మంత్రి కిసాన్ యోజన ద్వారా 12 కోట్ల మంది రైతులకు ఏడాదికి 6 వేలు రుణాలు ఇవ్వడం తో పాటు అనేక ఇతర పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోడీ పేదల పక్షపాతి అని దేశ ప్రజలందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బలపరచాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి పైడిపెల్లీ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ వంగర మల్లేశం,కొండాపూర్ శక్తి కేంద్ర ఇంఛార్జి కంది శంకర్, నాయకులు,ఉపసర్పంచ్ మట్ట శ్రీనివాస్ రెడ్డి,కిసాన్ మోర్చ మండల ప్రధాన కార్యదర్శి వడియల రవీందర్ రెడ్డి,బూత్ అధ్యక్షులు గుల్ల సంపత్, మాడిశెట్టి కిరణ్,బుర్ర గంగయ్య, బింగీ రాజలింగం,గుల్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.