సీఎం కప్ ఆటల పోటీలలో విజేతలకు మెరిట్ సర్టిఫికెట్ 

సీఎం కప్ ఆటల పోటీలలో విజేతలకు మెరిట్ సర్టిఫికెట్ 

ముద్ర, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని ఎంపిడివో కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సీఎం కప్పు 2023 ఆటల పోటీలలో భాగంగా గెలుపొందిన వారికి మెరిట్ సర్టిఫికెట్స్ జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి శ్రీరామ్ శ్యామ్, మండల ప్రత్యేక అధికారి నవీన్ కుమార్, కార్యక్రమం చైర్మన్ అండ్ కన్వీనర్ ఎంపిడివో జి.కల్పన , మున్సిపల్ కమిషనర్ జమ్మికుంట  శ్రీనివాస్, మండల విద్యాధికారి వి శ్రీనివాస్, మండల పంచాయతీ అధికారి ఎస్ సతీష్ కుమార్ , జూనియర్ సహాయకులు శ్రీహరి  పిఈటి సిబ్బంది బి శేఖర్, జి శ్రీనివాస్, బి.సత్యనారాయణ,బి. శేఖర్, రేణుక ,ప్రేమలత  పాల్గొనడం జరిగింది.