ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చెయ్యాలి

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చెయ్యాలి

జడ్పీటీసీ గీకురు రవీందర్ 

చిగురుమామిడి ముద్ర న్యూస్:చిగురుమామిడి మండల కేంద్రములో ఐకేపీ ఆధ్వర్యములో నడుపుతున్న వరి  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక జడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్ తనిఖీ చేశారు. సెంటరులో ధాన్య సేకరణలో జాప్యం జరుగుందని రైతులు ఆయనతో మొరపెట్టుకున్నారు.  హమాలీ కొరత వల్ల ఏర్పడ్డ సమస్యను  నిర్వాహకులు, హమాలీలను సమన్వయము చేసి, వేరే ప్రాంతాల హమాలీలను పిలిపిస్తూ పనులు వేగవంతం చేయాలన్నారు. ఈ సందర్బంగా  జడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతూ   కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కొనుగోలు ప్రక్రయను వేగవంతం చేయాలన్నారు. ఇప్పటి వరకే 8.5 వేల  క్వి. మాత్రమే సేకరించడం బాధాకరమని, రోజుల తరబడి రైతులు కేంద్రాల  వద్దే పడిగాపులు కాస్తున్నారన్నారు. ధాన్యం  సేకరణలో తాలు, తేమ పేరుతో ఎక్కువ తూకం వేయరాదని ప్రభుత్వ నిబందనలు పాటించాలని, లేనిచో చర్యలు తీసుకోబడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బెజ్జంకి లక్ష్మణ్, మాజీ సింగిల్ విండో ఛైర్మెన్ పణ్యాల ప్రభాకర్ రెడ్డి, పోటు మల్లారెడ్డి, ఐకేపీ సీసీ సత్యనారాయణతో పాటు రైతులు పాల్గొన్నారు.