దేశం నలుమూలల విస్తరించిన కరీంనగర్ గ్రానేట్

దేశం నలుమూలల విస్తరించిన కరీంనగర్ గ్రానేట్
  • దేశం నలుమూలల విస్తరించిన కరీంనగర్ గ్రానేట్
  • టి.ఎస్.ఐ.పాస్ ద్వారా పరిశ్రమల స్థాపన సులభతరం
  •  దళిత బంధుతో 1000 మంది పారిశ్రామికవేత్తలు
  • జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: మారుతున్న సామాజిక, పారిశ్రామిక, ఆర్థిక పోకడలకు తగ్గట్టుగా పరిణితిని సాదిస్తూ ప్రగతిబాటలో పయనించేలా చేయాలంటే ఒక్క ప్రభుత్వం వల్ల మాత్రమే సాద్యపడదని, పరిశ్రమల తోడ్పాడు ఉంటేనే సాద్యమవుతుందని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. తెలంగాణ ఆవిర్బావ దశాబ్ది వేడుకలలో బాగంగా మగళవారం 4వ రోజు తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం  కార్యక్రమాన్ని గ్రానేట్ అసోసియోషన్, ఐటి టవర్, కలేక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించగా జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ ముఖ్య అతిగా పాల్గోన్నారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ 2002లో  కరీంనగర్ జిల్లాలో చిన్నగా ప్రారంభమైన గ్రానేట్ వ్యాపారం అంచలంచలుగా ఎదిగి 2023 నాటికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేసే దశకు చేరి, ప్రస్తుతం తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 15వేల నుంచి 20 వేల మందికి ఉపాదిని కల్పించగలింగిందని కొనియాడారు. కరీంనగర్ లో లభించే గ్రానేట్ భాతరదేశం నలుమూలల చాలా ప్రదేశాలలో కనిపించిందని తెలిపారు.  తెలంగాణ ఆవిర్బావానికి పూర్వం పరిశ్రమను స్థాపించాలంటే అనేక రకాల అనుమతులు పోందాల్సి వచ్చేదని.  

అనుమతులు పొంది పరిశ్రమను స్థాపించిన ఉత్పత్తి వ్యయం భారం కావడంతో  అనేక పరిశ్రమలు ప్రారoభదశలోనే మూతపడే దుస్థితి చేరుకునేవన్నారు. తెలంగాణ రాష్ట ఆవిర్బావం అనంతరం టి.ఎస్. ఐ.పాస్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో పరిశ్రమల స్థాపనకు ఆన్ లైన్ వేదికగా ఒకేఒక ధరఖాస్తు సమర్పించడం ద్వారా అన్ని శాఖల అనుమతులను పొందడం సులభతరమైదని తెలిపారు.   అదేవిధంగా  పరిశ్రమలు ప్రధానంగా ఎదుర్కోంటున్న విద్యుత్ సమస్యను పరిష్కరించి, ప్రభుత్వం సహాయ సహకారాలను అందించడంతో జిల్లాలో గ్రానేట్ పరిశ్రమ ప్రగతి ప్రస్థానం సాధించిందన్నారు.  గ్రానేట్ బ్లాస్టింగ్ తరువాత వెలువడే వెస్టేజిని నిర్మాణ పనుల్లో వినియోగించాలని, ఇప్పటికే  పలు నగరాల్లో నిర్మాణాలకు వినియోగించడం జరుగుతుందని, ఆదిశగా కృషిచేయాలని సూచించారు.   జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ది పనులను పరిశీలించడానికి గతంలో పర్యటించిన నీతి అయోగ్ బృందం అన్ని వసతులు కలిగిన కరీంనగర్ జిల్లాను మోడల్ జిల్లాగా గుర్తించిందని తెలిపారు.  కరీంనగర్ జిల్లాలో నిర్వహిస్తున్న గ్రానేట్ వ్యాపారాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత అభివృద్దిని సాధించాలని ఆకాంక్షించారు.

అనంతరం ఐటి టవర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గోన్న కలెక్టర్, జిల్లాలో ఏర్పాటు చేసిన ఐటి టవర్ వేదికగా కృషిచేసిన టెక్కీలు చాలామంది ప్రస్తుతం మంచిస్థానాలలో నిలిచారని తెలిపారు.  అభివృద్ది చెందుతున్న టెక్నాలజికి అనుగుణంగా పరినితి చెందాలన్నారు. కొత్తకొత్త ఆలోచనలతో స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని, మీరు సాధించిన ప్రగతే మీ స్థానాన్ని నిర్ణయిస్తుందని తెలిపారు.  కరీంనగర్ ఐటి వేదికగా జిల్లాలో అనిమియా వంటి వాటి గురించి వివరించే  మెబైల్ యాప్ లను సృష్టించి ఎంతోమందికి మహిళకు వారి ఆరోగ్యంపై అవగాహన కల్పించగలిగామని, ఆదే విధంగా వారది మెబైల్ యాప్ ద్వారా విద్యా, ఉద్యొగ అవకాశాలను గురించి తెలియజేయడంతో పాటు, వాటికి కావలసిన మెటీరియల్ ను అందించగలిగిందని తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగులుగా ఉన్న వారందరు రేపు ఉద్యోగాలను కల్పించే దిశగా అభివృద్ది సాధించాలని,  మీకందరికి ప్రభుత్వ పరంగా కావాలసిన సహాయ సహకారాలను అందించడం జరుగుతుంది  తెలిపారు.

కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గోని మాట్లాడుతూ, కరీంనగర్ జిల్లాలో పరిశ్రమ స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా సహాకారాలను అందించిందని, గడిచిన పదేళ్లలో కరీంనగర్ కార్పోరేషన్ లో ఇన్ ఫ్రాస్ట్రక్టర్ కొరకు 2500 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు.  ఒక్క దళితబందు కార్యక్రమానికే 2వేల కోట్లను మంజూరు చేసిందని. ప్రతి సంవత్సరం వివిధ పథకాల కొరకు 4వందల నుండి 5 వందల కోట్లను మంజూరు చేస్తుందని తెలిపారు.  జిల్లా ఆవిర్బావానికి పూర్వం, తరువాత అని బేరీజు వేసుకుంటే పరిశ్రమలు స్థాపన జరిగి ఘననీయమైన అభివృద్దిని సాధించడం జరిగిందన్నారు.  చేనేత కార్మీకులు కొరకు సహకారాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు.

పారిశ్రామీక అభివృద్ది దిశగా ఉత్తర తెలంగాణ మొత్తంలో మొదటి ఐటి టవర్ ను కరీంనగర్ లో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. తెలంగాణలో మొట్టమొదటిగా రైతుబందు, దళితబందు పథకాలను కరీంనగర్ లో ప్రవేశపెట్టడం జరిగిందని దళిత బంధు పథకం ద్వారా 1000 మంది పారిశ్రామికవేత్తలుగా ఎదిగారని, రైతుబందు ద్వారా పంట సాగుకు రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడిసాయాన్ని అందించడంతో రైతు ఆత్మహత్యలు తగ్గిపోయాయని,  దళితబందు పథకాన్ని అమలపై అనుమానాలను రేకెత్తించిన వారిముందే పథకాన్ని విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా అభివృద్దికి తోడ్పడే పరిశ్రమల స్థాపన టిఎస్ ఐపాస్ ద్వారా సులభతరమై పరిశ్రామల స్థాపన, ఆసుపత్రలు, హోటల్ ఇతర వ్యాపారరంగాల అభివృద్ది జరుగుతుందని తెలిపారు.  ఈ కార్యక్రమంలొ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, ట్రైని కలెక్టర్ లేనిన్ వాట్సల్ టోప్పో జడ్పీ సిఈఓ ప్రియాంక,  కార్మిక శాఖ  ఉప కమీషనర్ రమేష్ బాబు, చేనేత  శాఖ  సహాయ సంచాలకులు, చేనేత సంఘం అద్యక్షులు రాంచందర్, రైస్ మిల్లర్ అసోసియోషన్ అద్యక్షులు నర్సింగ రావు, గ్రానైట్ అసోసియెషన్ అధ్యక్షులు, తదితరులు పాల్గోన్నారు.