ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి

ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి

ముద్ర, జమ్మికుంట: ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా మానేరు తీరం వెంబడి ఇష్ట రీతిన  ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని వెంటనే అక్రమ రవాణాలను అరికట్టాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి  డిమాండ్ చేశారు. జమ్మికుంట లోని స్థానిక పాత రామకృష్ణ స్కూల్ ఆవరణలో విలేకరుల సమావేశంలో మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ  మానేరు  పరివాహక ప్రాంతం నుండి పర్యావరణ మరియు ప్రభుత్వ అనుమతులు లేకుండా ట్రాక్టర్ల ద్వారా రోజుకు 2000 నుండి 3000 ట్రిప్పులు ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్నారు.  ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్సిన మైనింగ్ రెవెన్యూ పోలీస్ శాఖలు పూర్తిగా విఫలమయ్యాయి అన్నారు. గౌరవ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను ఖాతరు చేయకుండా పాలకవర్గ పార్టీ ప్రజా ప్రతినిధి, అధికారుల అండదండలతో కోట్లాది రూపాయల ప్రభుత్వ సహజ వనరు అయిన ఇసుకను అక్రమంగా దోచుకుంటున్నారని వారిపై వెంటనే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాలుగు రోజుల్లోగా ఇసుక అక్రమ రవాణా దారులపై చర్యలు తీసుకోకపోతే సిపిఎం శ్రేణులు అడ్డుకునీ అధికారులకు అప్పగిస్తామని హెచ్చరించారు. చౌకగా దొరికే ఇసుకను అధికార పార్టీ నాయకుడి చేతివాటంతో  ఇసుక మరింత  ప్రియమైందన్నారు. 

ఒక్కో ట్రాక్టర్ ట్రిప్పు ఇసుక ధర 2500 నుండి 5వేల వరకు వసూలు చేస్తున్నారని అన్నారు. మానేరు పరివాహక ప్రాంత రైతులు గగ్గోలు పెడుతున్నప్పటికీ అధికారులు ఎంత మాత్రం  పట్టించుకోవడం శోచనీయమన్నారు. 9 సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూములు ఇవ్వలేదని పూర్తయిన రెండు గదుల ఇల్లు అరులైన పేదలకు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ రుణాలు అందించకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఎస్సారెస్పీ ద్వారా వెంటనే నీటిని విడుదల చేయాలని రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోకుండా పాలకవర్గ పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ప్రతినిత్యం పనిచేస్తున్నారని స్వపక్షంలో విపక్షంల టిఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె న్యాయబద్ధమైనదని ఎలాంటి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని చట్టబద్ధంగా చేస్తున్న సమ్మెకు  సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు  స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జోన్ కమిటీ సభ్యులు కొప్పుల శంకర్, చెల్పూరి రాములు, దండిగారి సతీష్, జక్కుల రమేష్, చల్ల కుమార్, దాసరి మొగిలి, దగడు సాయి, తదితరులు పాల్గొన్నారు.