పెరికల సమస్యను పరిష్కరించాలి

పెరికల సమస్యను పరిష్కరించాలి

 శంకరపట్నం ముద్ర జూలై 9 :  తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని జిల్లా పేరికల సంఘం అధ్యక్షుడు గాండ్ల చంద్రశేఖర్ జిల్లా కార్యదర్శి బసవ వెంకన్న డిమాండ్ చేశారు. శంకరపట్నం మండల కేంద్రంలో ఆదివారం నాడు పెరిక సంఘం మండల సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కులం పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని వారు అన్నారు మౌలిక సమస్యల పరిష్కారం కాక కొన్ని ఏళ్లు గడుస్తున్నాయని వారన్నారు. అనంతరం జరిగిన పెరికల సంఘం అధ్యక్షులుగా చింతం నవీన్ కుమార్ ,గౌరవాధ్యక్షులుగా మీస శ్రీనివాస్ ,ప్రధాన కార్యదర్శిగా మీస తిరుమలేష్, కోశాధికారిగా కారుకూరి శ్రీనివాస్ , కార్యనిర్వాహక కార్యదర్శిగా మేడిశెట్టి భూమయ్య , ప్రచార కార్యదర్శిగా వనపర్తి పరమేశ్వర్ , ఉపాధ్యక్షులుగా మైదం శెట్టి కుమారస్వామి , పాలేటి అశోక్ , కార్యదర్శులుగా చింతం మల్లయ్య, గోపి రాజమల్లు ,గాండ్ల రాజయ్య కార్యవర్గ సభ్యులుగా మైదంశెట్టి రాములు , మేడిశెట్టి మల్లేశం, గోపి వీరమల్లు ప్రత్యేక ఆహ్వానితులుగా భూసాని రామస్వామి, మైదంశెట్టి కేదారి, చింతం శంకరయ్య, సలహాదారులుగా మీస భాస్కర్, పోతరాజు లక్ష్మణ్ వనపర్తి మల్లేశం ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో మండలంలోని పెరిక కులస్తుల తో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి బసవ  అధ్యక్షులు కందుల అరుణ్ కుమార్, కార్యదర్శి కారుకూరి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.