వైద్యరంగంలో గణనీయమైన పురోగతిని సాధించాం

వైద్యరంగంలో గణనీయమైన పురోగతిని సాధించాం
  • ఆత్యాధునిక పరికారాలతో వైద్య చికిత్స
  • దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఘనంగా వైద్య ఆరోగ్య దినోత్సవం
  •  మంత్రి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక వైద్యరంగంలో గణనీయమైన పురోగతిని సాధించామని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా లో భాగంగా రేకుర్తి లోని శుభం గార్డెన్స్ లో నిర్వహించిన వైద్యారోగ్య దినోత్సవంలో గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా పాల్గోని మాట్లాడుతూ 21 రోజుల పాటు నిర్వహించుకుంటున్న దశాబ్ది ఉత్సవాలను బావితరగాలకు గుర్తుండిపోయోలా అద్బుతంగా నిర్వహించుకోవాలన్నారు.   గతంలో ఆరకొర వైద్య సిబ్బందితో సకాలంలో కనీస వైద్యం కూడా అందేది కాదని, ఎప్పుడు సీజనల్, కలరా వంటి విషజ్వరాలే, ఎక్కడచూసిన అపరిశుభ్రమైన వాతావరణమే కనిపించేదని అన్నారు, 2010లో డెంగ్యూ వ్యాధితో బాదపడుతు మనకళ్లముందే ఎన్నో మరణాలు సంభవించాయన్నారు.  

అనారోగాల సమస్య ఎక్కడ మొదలయింది, దానిని నిరోదించడం ఎలా అని కూడ ఎవరకు ఆలోచించలేదని అన్నారు.   వైద్యవిద్యను అభ్యసించాలనే పేద విద్యార్థుల  కలను నేరవెరస్తూ తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఒక్క వైద్యకళాశాలను ఎర్పాటు చేయడం జరిగిందన్నారు.    ప్రైవేట్ ఆసుపత్రుల్లో బిల్లుల కోరకు ఆస్థులు ఆమ్ముకునే స్థితి గతంలో ఉండేదని, ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందిస్తున్న వైద్యం పై, కేసీర్ కిట్ లతో ప్రజల్లో నమ్మకం పెరిగిందని తెలిపారు.తెలంగాణలోనే ప్రప్రథమంగా ల్యాక్టిషియన్ సెంటర్ ను ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు.  అప్పుడే పుట్టిన బిడ్డకు ముర్రుపాలు పట్టించాలని అంటారు.  కాని అలా పాలు పట్టించలేని స్థితిలో ఉన్న బాలింతల కోరకు ఈ కేంద్రాన్ని ప్రభుత్వ ప్రదాన ఆసుపత్రిలో ప్రారంబించుకోవడం జరుగుతుందన్నారు.  భారతదేశంలోనే గర్బీణీలకు న్యూట్రిషియన్ కిట్ లను అందిస్తు  పర్ క్యాపిటా దిశగా వైద్యాన్ని అభివృద్ది చేస్తున్న ఒకేఒక్క రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.  

 భయంకరమైన కరోనా సమయంలో పోలీస్, వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతోమంది విలువైన ప్రాణాలను కాపాడారని, అనునిత్యం వైద్య సిబ్బంది అందుబాటు ఉండి అద్బుతమైన వైద్య సేవలను అందించి కరోనాపై విజయం సాధించారన్నారు.  ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైన  వైద్య సిబ్బంది తమ కుంటుంబాలను వదిలి ప్రజల  కొరకు కృషిచేసిన ఆశా, ఎఎన్ఎం, డాక్టర్లు  ఇతర వైద్య సిబ్బందికి  ఈ సందర్బంగా కృతజ్ఞతలను తెలియజేశారు. జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ,  కేరళ, తమిళనాడులో ప్రైమరి, సెంకడరి మొదలగు ఆరోగ్య సేవలపై కోన్నెల్లుగా అద్బుతమైన ప్రగతిని సాదిస్తే,  కేవలం 9 సంత్సరాలలోనే తెలంగాణ రాష్ట్రం వైద్య పరంగా వాటిని మించిన విజయాన్ని సాదించగలిగిందని అన్నారు.

ఒక్క కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే  2 ప్రైవేటు మెడికల్ కళాశాలలు ఉండగా, మరోక ప్రభుత్వ వైద్య కళాశాలను  ఈ విద్యాసంవత్సరం నుండి ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు.  కృషిచేసిన ప్రతిఒక్క వైద్య సిబ్బందికి, ఆరోగ్య కార్యకర్తలకు, ఆశా, ఎఎన్ఎంలకు దన్యావాదాలు తెలిపారు.  ఈ సందర్భంగా పలువురు గర్బవతులకు న్యూట్రిషన్ కిట్లను అందించారు. ఈ కార్యక్రమంలో మెయర్ వై. సనీల్ రావు,  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, శిక్షణ సంయుక్త కలెక్టర్ నవీన్ నికోలస్, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ రెడ్డవేణి మదు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం  అనీల్, జిల్లా వైద్యాధికారి కె. లలితా దేవి, జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఎల్. కృష్ణ ప్రసాద్, ఎంపీపీ టీ లక్ష్మయ్య, జెడ్పిటిసిలు, కార్పొరేటర్లు  ప్రజాప్రతినిధులు,వైద్య సిబ్బంది, ఏఎన్ఎం, ఆశ  కార్యకర్తలు తదితరులు  పాల్గోన్నారు.