మలుపు సంస్థ ద్వారా  పారిశ్రామిక సదస్సు

మలుపు సంస్థ ద్వారా  పారిశ్రామిక సదస్సు

ముద్ర, జమ్మికుంట:- మలుపు సంస్థ జూలై 6.7 తేదీలలో జమ్మికుంటపట్టణం మిని లెదర్ పార్క్ లో మలుపు వ్యవస్థాపకులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ ఐపీఎస్ డిజిపి(ఆర్ ఐ)  ఆధ్వర్యంలో జమ్మికుంట, స్టేషన్ ఘణ పురం మరియు వరంగల్ లెదర్ పార్క్ లలో చర్మ సంబంధ వస్తువుల తయారీ ట్రైనింగ్ తీసుకొని ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వ సహాయం లేకుండా కూలి పనులు చేసుకుంటున్న మలుపు సొసైటీ సభ్యులకు వారి కాళ్ళ పై వారు జీవించే పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసే ఉద్దేశ్యంతో పారిశ్రామిక అవగాహన సదస్సు నిర్వహించారు. లెదర్ పార్క్ నుండి ఇదివరకే ఎంపిక చేసుకున్న 30 మంది హాజరైనారు. వారి వారి నైపుణ్యాలను అనుసరించి ఒక్కొక్క లెదర్ పార్కు, నుండి పదిమంది చొప్పున మూడు పార్కులకు కలిపి 30 మందికి ప్రభుత్వం నుండి పారిశ్రామిక లోన్లు ఇప్పించడం కొరకు చర్చించుకోవడం జరిగింది.దీనిలో భాగంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్న పారిశ్రామిక లోన్ల పై విస్తృతంగా చర్చించుకోవడం జరిగింది.