అంగన్వాడి కేంద్రంలో మెనూ పాటించని నిర్వాహకులు.

అంగన్వాడి కేంద్రంలో మెనూ పాటించని నిర్వాహకులు.
  • బాలింతలకు,గర్భిణీ స్త్రీలకు వండిన కూరల్లో లక్క పురుగులు, నల్లపురుగులు.

సారంగాపూర్ ముద్ర:సారంగాపూర్ మండలంలోని లక్ష్మీదేవి పల్లి గ్రామంలో గల అంగన్వాడి కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా మెనూ పాటించడం లేదని అంగన్వాడి కేంద్రం ఎదుట బాలింతలు గర్భిణీ స్త్రీలు నిరసన వ్యక్తం చేశారు. స్థానికల కథనం ప్రకారం లక్ష్మీదేపల్లి గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో భూక్య ఆదిలక్ష్మి అంగన్వాడి కార్యకర్తగా పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 0-4 పిల్లల కోసం పౌష్టికంగా ఉండేందుకు కోడి గుడ్లు, గర్భిణీ స్త్రీలు బాలింతలకు ప్రతిరోజు పౌష్టికాహారం అందించేందుకు కూరగాయలతో పాటు అన్నం పెట్టాల్సి ఉంటుంది. కాగా ఈ అంగన్వాడి కేంద్రంలో బాలింతలకు గర్భిణీలకు అందించే కూరల్లో  లక్క పురుగులు నల్లపురుగులు వస్తున్నాయని అంగన్వాడి కేంద్ర నిర్వాహకురాలు ఆదిలక్ష్మిని నిలదీశారు.

గత వారం రోజుల నుండి ఇలాగే ఇలాంటి సంఘటన జరుగుతున్న అంగన్వాడీ కార్యకర్తకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చి పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారికి ఫోన్ లో సమస్య వివరించగా అంగన్వాడి సూపర్వైజర్ ను పంపి సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని ఆదేశించారు.ఈ విషయమై అంగన్వాడి సూపర్వైజర్ లతను వివరణ కోరగా అంగన్వాడి మెనూలో పప్పు లేదు అని బాలింతలకు గర్భిణీ స్త్రీలకు భోజనంలో కూరగాయలు వండాలని అన్నారు.అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి గర్భిణీ స్త్రీలు, బాలింతల ను విచారణ జరిపి ఉన్నతస్థాయి అధికారులకు పంపించారు.