ఎస్సై అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

ఎస్సై అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

 ముద్ర ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ కమీషనరేట్ తో పాటు జగిత్యాల జిల్లాకు చెందిన ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ బుధవారం కరీంనగర్ కమీషనరేట్ కేంద్రంలో ప్రారంభం అయింది. పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బారాయుడు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ నెల 23 వరకు కొనసాగనున్న ఈ సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం లో 5814 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది.

కేటగిరీల వారీగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు షామియానాలను ఏర్పాటు చేయడంతో పాటు మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు. అభ్యర్థులకు తలెత్తే సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. బుధవారం జరిగిన కార్యక్రమానికి 600 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డిసిపి (పరిపాలన) జి చంద్రమోహన్ అడిషనల్ డిసిపి( సిఏఅర్) భీం రావు, ఏసిపి సి ప్రతాప్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి ముని రామయ్య, సూపరిండెంట్లు ఏవిఎన్ చారి, కళాధర్, పార్వతిలతో పాటుగా రిజర్వు ఇన్స్పెక్టర్లు సురేష్, మురళి, మల్లేశం శేఖర్ బాబు లతో పాటుగా పలువురు పోలీసు అధికారులు మినిస్టీరియల్ విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.